Akash Puri : నాన్న‌ని అన్న‌ మాట‌ల‌కు బాధ‌ప‌డ్డాను, ఏదో ఒక రోజు గ‌ర్వించేలా చేస్తా: పూరీ త‌న‌యుడు

October 23, 2021 4:37 PM

Akash Puri : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ పవర్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ప్రముఖ డైరెక్టర్ పూరీజగన్నాథ్. ఆయన కొడుకు ఆకాష్ పూరీ నటించిన లేటెస్ట్ సినిమా రొమాంటిక్. ఈ సినిమాను మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తన తండ్రి లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.

Akash Puri said he will make her father very proud one day

తన తండ్రి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారని.. అయితే ఆ సక్సెస్ ఆయనకు అంత ఈజీగా రాలేదని ఆకాష్ అన్నారు. ఇండస్ట్రీలో తన తండ్రి మీద వచ్చిన రూమర్స్, కామెంట్స్ ని విని తాను ఎంతో బాధకు గురయ్యానని అన్నారు. ఆకాష్ పూరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చారు. విజయ్ దేవరకొండ వర్క్ కి ఆకాష్ పూరీ పెద్ద ఫ్యాన్ అని అన్నారు. లైగర్ సినిమా కోసం మీరు ఎంతో కష్టపడ్డారని అన్నారు.

అందుకే ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ ని సాధిస్తారని అన్నారు. రొమాంటిక్ సినిమాను ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కించారని అన్నారు. ఎన్నో రోజులుగా మా నాన్న గురించి మాట్లాడాలని.. ఇప్పుడు తనకు ఆ అవకాశం వచ్చిందని అన్నారు. నర్సీపట్నంలో పుట్టిన పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగారని, కుటుంబం, బంధువులు, స్నేహితులందరి భాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుని ఆయన ప్రయాణం ప్రారంభించారన్నారు.

అంతా బాగుంది.. అనుకునే టైమ్ కి ఓ వ్యక్తిని నమ్మడంతో తమ జీవితం తలక్రిందులైందని అన్నారు. అయినా కూడా మహా సముద్రాన్ని ఈదినట్లు.. మమ్మల్ని సంతోషంగా చూసుకోవడానికి ఎంతో కష్టపడ్డారని అన్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పూరీ జగన్నాథ్ కెరీర్ అయిపోయింది. రొటీన్ సినిమాలే చేస్తున్నారనే టాక్ విని తానెంతో బాధపడ్డానని అన్నారు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు.

ఈ సినిమా సక్సెస్ తో తాను కాలర్ ఎగరేసుకున్నానని.. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం అంటూ ఆకాష్ పూరీ ఎమోషనల్ అయ్యారు. అలాగే నువ్వు కూడా నన్ను చూసి గర్వపడేలా కష్టపడతానని అన్నారు. ఆ మాటలు విన్న పూరీ జగన్నాథ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆకాష్ మాటలకు ఇంప్రెస్ అయిన బండ్ల గణేష్, ఆకాష్ స్పీచ్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి గాడ్ బ్లెస్ యూ బంగారం.. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావంటూ.. విష్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now