Ajith Thegimpu Movie : థియేటర్స్‌లో విడుదలైన కొద్ది రోజులకి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అజిత్ నటించిన తెగింపు చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించగా, ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అజిత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ హైప్ బాగానే ఉంటుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో అజిత్ సరికొత్త లుక్‌లో అల్ట్రా స్టైలిష్ స్వాగ్‌తో కనిపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తునివు సినిమా రిలీజ్‌కు ముందే, ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
అయితే తెగింపు సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో పాటు అజిత్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆక్టుటకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అయితే ఈ సినిమాకు తమిళంలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనవరి 11న విడుదలైన ఈ సినిమా.. రిలీజైన నెల రోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని అంటున్నారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. తెగింపు మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. స్ట్రీమింగ్ వచ్చేసి ఫిబ్రవరి 10 నుండి కానుందని తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై మేకర్స్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఓటీటీలో ఈ సినిమాని చూసేందుకు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకు మోసాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు వినోద్. ఇదే కథను కాస్త అటూ ఇటూగా సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో చెప్పించాడు దర్శకుడు పరశురామ్. అందులోనూ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన బడా వ్యక్తుల గురించి చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…