ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఫోన్ కొంటే రూ.6వేలు ఇస్తారు..!

October 9, 2021 9:48 AM

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ వినియోగ‌దారులకు అద్భుత‌మైన బంప‌ర్ ఆఫర్‌ను అందిస్తోంది. మై ఫ‌స్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ‌ర్ కింద ఎయిర్‌టెల్ దీన్ని త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.12వేలు ఆపైన విలువ క‌లిగిన ఫోన్‌ను కొంటే ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు రూ.6వేల‌ను వెన‌క్కి ఇస్తుంది.

airtel gives rs 6000 back who purchases smart phone in their site

శాంసంగ్‌, షియోమీ, వివో, ఒప్పో, రియ‌ల్‌మి, నోకియా, ఐటెల్‌, లావా, ఇన్ఫినిక్స్‌, టెక్నో, మోటోరోలా వంటి కంపెనీల‌కు చెందిన 150కి పైగా ఫోన్ల‌పై ఎయిర్‌టెల్ ఈ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. అందుకుగాను ఎయిర్‌టెల్ సైట్‌లో ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ ఫోన్‌లో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్ వేసి దాన్ని 36 నెల‌ల పాటు నెల‌కు రూ.249 చొప్పున రీచార్జి చేస్తూ ఉండాలి.

ఈ క్ర‌మంలో మొద‌టి 18 నెల‌ల త‌రువాత రూ.2000 వెన‌క్కి ఇస్తారు. 36 నెల‌లు ముగిశాక రూ.4000 ఇస్తారు. ఇలా మొత్తం రూ.6000 వెన‌క్కి వ‌స్తాయి. ఈ విధంగా ఫోన్‌ను కొని రూ.6వేల‌ను వెన‌క్కి పొంద‌వ‌చ్చు. ఇక ఇందులో భాగంగా వ‌న్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కింద ఒక‌సారి ఫోన్ డిస్‌ప్లే ప‌గిలినా దాన్ని ఉచితంగా అమ‌ర్చి ఇస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now