Airtel 5G : 8 న‌గ‌రాల్లో ఎయిర్‌టెల్ 5జి సేవ‌లు ప్రారంభం.. 5జి ని పొందాలంటే.. సిమ్ మార్చాలా..?

October 6, 2022 4:08 PM

Airtel 5G : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌లే ఢిల్లీలో నిర్వ‌హించిన ఇండియ‌న్ మొబైల్ కాంగ్రెస్ 2022 కార్య‌క్ర‌మంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా 5జి సేవ‌ల‌ను ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు ముందుగా ప‌లు ఎంపిక చేసిన న‌గ‌రాల్లో 5జి సేవ‌ల‌ను అందిస్తామని ప్ర‌క‌టించాయి. ఇక జియో 4 న‌గ‌రాల్లో 5జి సేవ‌ల‌ను ప్రారంభించ‌గా.. ఎయిర్‌టెల్ తాజాగా 8 న‌గ‌రాల్లో 5జి సేవ‌ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఎయిర్‌టెల్ ఒక ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది.

ఎయిర్‌టెల్ 5జి సేవ‌లు 8 న‌గ‌రాల్లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, సిలిగురి, నాగ్‌పూర్‌, వార‌ణాసి ప్రాంతాల్లో 5జి సేవ‌ల‌ను ప్రారంభించామ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. ఇక త్వ‌ర‌లోనే దేశంలోని అన్ని ప్రాంతాల‌కు త‌మ 5జి సేవ‌ల‌ను విస్త‌రిస్తామ‌ని ఎయిర్ టెల్ తెలియ‌జేసింది. అయితే 5జి సేవ‌ల‌ను పొందాలంటే ప్రస్తుతం ఉన్న 4జి సిమ్‌ల‌ను మార్చాల్సిన ప‌నిలేదని.. 5జి టెక్నాల‌జీని ఇప్ప‌టికే ప్ర‌స్తుతం ఉన్న సిమ్‌లు క‌లిగి ఉన్నాయ‌ని.. క‌నుక సిమ్ మార్చ‌కుండానే వినియోగ‌దారులు 5జి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఎయిర్‌టెల్ తెలియ‌జేసింది.

Airtel 5G services started in 8 cities no sim change required
Airtel 5G

అయితే 5జి సేవ‌ల‌ను పొందాలంటే.. వినియోగ‌దారులు 5జిని స‌పోర్ట్ చేసే ఫోన్‌ను క‌లిగి ఉండాలి. ఇక హైద‌రాబాద్‌లో ఉన్న ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు ప్ర‌స్తుతం త‌మ 5జి ఫోన్ల‌లో 5జి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. కాగా ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు అన్ని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో 5జి ని అందిస్తామని, వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జి సేవ‌లు ల‌భిస్తాయ‌ని.. ఎయిర్‌టెల్ ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. ఇక 5జి టెక్నాల‌జీ వ‌ల్ల ప్ర‌స్తుతం వాడుతున్న 4జి క‌న్నా వినియోగ‌దారులు 20 నుంచి 30 రెట్లు ఎక్కువ ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ప‌నుల‌ను వేగంగా చేసుకునేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now