Aha : ఆహాలో త్వరలో రానున్న మూవీలు, సిరీస్‌ ఇవే..!

November 5, 2021 3:57 PM

Aha : నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.  గ్లోబల్ రేంజ్‌లో ప్ర‌తి సారీ ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ప్రణాళికలు వేస్తూ దూసుకుపోతుంది ఆహా.

Aha these are the movies and series coming on aha

ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో… ఇంట్రెస్టింగ్ గేమ్ షోలతో సాగిపోతోంది. ప్రారంభించిన అతి తక్కున సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో నంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఈ తెలుగు ఓటీటీ సంస్థ. రానున్న రోజుల‌లో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ను పంచేందుకు ఆహా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది.

రానున్నరోజుల‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మంచి రోజులొచ్చాయి, లక్ష్య, DJ టిల్లు, రొమాంటిక్, అనుభవించు రాజా, పుష్పక విమానం, గ‌ని చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ఆహా ఒరిజిన‌ల్స్ విష‌యానికి వ‌స్తే సేనాపతి, భామ కలాపం, 3 రోజెస్, అన్యస్ ట్యుటోరియల్, అడల్టింగ్, ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, కుబూల్ హై, సెగు టాకీస్ ఆహాలో ప్ర‌సారం కానున్నాయి.

అన్‌స్టాప‌బెల్ విత్ ఎన్‌బీకే, స‌ర్కార్ వంటి షోస్‌తోపాటు మ‌రెన్నో షోస్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. రానున్న రోజులలో మ‌రింత ఫ్రెండ్లీగా మార్చేందుకు అల్లు అరవింద్ ప్ర‌యత్నిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్‏ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ ను అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now