Aha 2.0 : అల్లు అర్జున్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆహా 2.0.. గ్రాండ్‌గా లాంచింగ్ కార్య‌క్ర‌మం..

November 3, 2021 10:22 AM

Aha 2.0 : తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ప్రేక్షకుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో నంబర్ వన్ దిశగా దూసుకుపోతోంది. ఇక రోజు రోజుకీ ఆహా సబ్ స్కైబర్స్ సంఖ్య పెంచుకుంటూ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని నిరూపించుకుంటోంది ఆహా.

Aha 2.0 grand launching program allu arjun

ఇప్పుడు ఆహా సేవ‌ల‌ను మరింత విస్తృతం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ఆహా 2.0 అవతరించనుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్‏ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ అందించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‏లో ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆహా 2.0కి లక్ష్మీ మంచు యాంకరింగ్ చేస్తుండగా.. ఆహా 2.0 లోగోను అల్లు అరవింద్, రామూ రావు జూపల్లి లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆహా ప్రారంభించేటప్పుడు ఎన్నో అనుమానాలు వచ్చాయని, కొత్త పని చేస్తున్నాము రిజల్ట్ ఎలా వుంటుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన జూపల్లి ఫ్యామిలీ.. నా విజన్‌ని సపోర్ట్ చేస్తూ దైర్యాన్ని ఇచ్చారని అన్నారు.

తెలుగు వాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అదరించినట్టు ఏ రాష్ట్రంలోనూ ఆదరించరని అల్లు అరవింద్ అన్నారు. ఆహాలో ఇప్పటివరకు చూసిన కంటెంట్ వేరు ఇప్పుడు 2.0లో రాబోయే కంటెంట్ వేరు.. కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. ఆహా 2.0లో సుపీరియర్ వెబ్ సిరీస్, సుపీరియర్ ఫిల్మ్స్ రాబోతున్నాయని అన్నారు అల్లు అరవింద్. ఆయ‌న మాట‌ల‌తో అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment