Adipurush Movie : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ.. ఆది పురుష్. ఈ చిత్రం వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ మూవీని వచ్చే ఏడాది.. అంటే.. 2023 జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. కనీసం ఆదిపురుష్‌తోనైనా హిట్ కొడతాడని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2న అయోధ్యలో ఆదిపురుష్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆది పురుష్ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించారని ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. క్యారెక్టర్లను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ యానిమేటెడ్ మూవీ అని టీజర్ చూసిన తరువాత తెలిసింది. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఇది మోషన్ గ్రాఫిక్స్ ఆధారంగా తెరకెక్కిన మూవీ. రియల్ మూవీ అని అందరూ అనుకున్నారు. కానీ యానిమేటెడ్ మూవీ కావడంతో మూవీపై జోక్స్ పేలుతున్నాయి. సోషల్ మీడియాలో అనేక మీమ్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఆది పురుష్ చిన్న పిల్లల సినిమా అని.. పిల్లల్ని సినిమాకు తీసుకెళ్తున్నట్లుగా ఉండే మీమ్స్‌ను బాగా షేర్ చేస్తున్నారు. అలాగే వానర సైన్యంతో చేసిన గ్రాఫిక్స్ అచ్చం హాలీవుడ్ మూవీ కాంగ్‌ను తలపిస్తున్నాయని అంటున్నారు. ఇక కొందరైతే ఈ మూవీని వీడియో గేమ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇది రిలీజ్ అయితే సంతోషం అని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంతో కాలంగా ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. గ్రాఫిక్స్ బాగానే ఉన్నా.. యానిమేటెడ్ సినిమా కావడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాదు.. సినిమా ప్రేక్షకులకు కూడా ఈ మూవీ నచ్చడం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…