Adipurush : బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 70 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం.
నవంబర్ నెల ఆఖరులోగా ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఆ తరువాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ వాడటం వల్ల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే ఎక్కువ సమయం తీసుకుండడం వల్ల ఈ చిత్రాన్ని నవంబర్ లోగా పూర్తి చేయాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…