Adbhutham Movie Review : ‘అద్భుతం’ సినిమా రివ్యూ..!

November 19, 2021 7:04 PM

Adbhutham Movie Review : యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వినూత్నమైన కథల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. జాంబిరెడ్డి సినిమాలో డిఫరెంట్ రోల్ లో యాక్ట్ చేసి నటనలో మంచి మార్కులే సాధించాడు. ఇక శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా, తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా అద్భుతం. ఈ సినిమాతో మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా లేటెస్ట్ గా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..!

Adbhutham Movie Review how is the movie

కథ : హీరో సూర్య ఓ టీవీ ఛానల్ లో యాంకర్ గా వర్క్ చేస్తుంటాడు.  లైఫ్ తనకు నచ్చినట్లు లేదని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి క్లైమేట్ అంతా మారిపోతుంది. సెల్ ఫోన్ కాల్స్ జంప్ అవుతుంటాయి. సూర్య ఫోన్ కు ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చేసిన అమ్మాయి హీరోయిన్ వెన్నెల. వీరిద్దరి మధ్య పరిచయం పెరిగాక.. సూర్య 2019 లో, వెన్నెల 2014 లో ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడి నుండి సినిమా స్టోరీ ఎలా టర్న్ అవుతుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్ : హీరో తేజ సజ్జా యాక్టింగ్ నీట్ గా డీసెంట్ ఉంది. ఇంతకు ముందు నటించిన సినిమాల కన్నా అద్భుతం సినిమాలో ఇంకా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో చక్కగా నటించాడు. ఇక శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా మంచి యాక్టింగ్ చేసింది.

టెక్నికల్ టీం ప‌నితీరు : డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ సినిమాతో పరిచయం అయినా తన టేకింగ్ బాగుంది. కెమెరామెన్ విద్యాసాగర్ తన టాలెంట్ ని ఈ సినిమాలో ప్రజంట్ చేశారు. రథన్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

ప్లస్ పాయింట్స్ : హీరో యాక్టింగ్, మ్యూజిక్

మైనస్ పాయింట్స్ : ఎడిటింగ్, కీలకమైన సీన్స్ లో లాగ్, కథ

విశ్లేషణ : ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య నడిచిన లవ్ ట్రాక్ బాగుంది. రెండు వేరు వేరు టైమ్ ట్రావెల్ లలో నడిచిన అద్భుతమైన లవ్ ట్రాక్.  ఓటీటీలోనే కదా.. హాట్‌ స్టార్‌ అకౌంట్‌ ఉన్నవారు  వినోదం కోసం ఒకసారి చూడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now