పురచ్చితలైవిగా పేరుగాంచిన జయలలిత తమిళ రాజకీయాలను కంటిచూపుతోనే శాసించారు. కన్నడనాట జన్మించి తమిళనాడులో స్థిరపడి వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. 14 ఏళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత.. తమిళులతో అమ్మ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. జయలలిత రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారుగా 140 సినిమాల్లో నటించించారు. కొద్దికాలం తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా ఏలారు.
ఆమె నటిగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. ఎంజీఆర్ మరణాంతరం అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. ఎంజీఆర్, జయలలిత తమిళ ఇండస్ట్రీలో ది బెస్ట్ పెయిర్ గా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కలిసి దాదాపుగా 28 చిత్రాల్లో కలిసి నటించారు.
1970 ప్రాంతంలో ఎంజీఆర్.. జయలలితను కాకుండా చంద్రకళ, మంజుల, లత కథానాయికలుగా ఓ తమిళ చిత్రంలో ఎంజీఆర్ నటించారు. తనను కాదని వేరే కథానాయికలతో ఎంజీఆర్ నటించడం జయలలితకు నచ్చలేదు. ఆ క్రమంలో జయలలిత, ఎంజీఆర్ మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత జయలలితకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో (1973) శోభన్ బాబుతో నటించే అవకాశం వచ్చింది. అలా శోభన్ బాబు, జయలలిత కలిసి డాక్టర్ బాబు చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో శోభన్ బాబుతో సాన్నిహిత్యం పెరిగింది.
1979 లో స్టార్ అండ్ స్టైల్ అనే ఓ ఇంగ్లిష్ పత్రిక వీరి రహస్య అనుబంధం గురించి రాసింది. ఆ ఇంగ్లిష్ ఆర్టికల్ ని తమిళనాట బాగా పేరు పొందిన కుముదం పత్రిక తమిళంలోకి అనువదించింది. దానికి స్పందించిన జయలలిత.. శోభన్ బాబు తనకు మధ్య బంధం ఉందని.. ఒకరి బాధలు, భావాలు పంచుకునేంత దగ్గరని అది ఎంతో పవిత్రమైన అనుబంధమని.. శోభన్ బాబును తను కలిసే నాటికి ఆయన వివాహితుడని కావున ఆయన సతీమణికి ద్రోహం చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ తరువాత వారి రహస్య అనుబంధం గురించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో వదంతులతో కూడిన వార్తలు దినపత్రికలలో వచ్చాయి. శోభన్ బాబు, జయలలిత మధ్య ఆ రహస్య అనుబంధం ఏమిటి అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో అలనాటి నటి సత్యప్రియ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. శోభన్ బాబు, జయలలిత మధ్య రహస్య అనుబంధం గురించి ఆమెను అడగగా.. జయలలిత పర్సనల్ మేకప్ మెన్ తనకు కూడా మేకప్ మెన్ గా పని చేశాడని, శోభన్ బాబు, జయలలిత మధ్య అనుబంధం నిజమేనని.. కానీ వారిద్దరికీ కలసి ఒక కూతురుకు జన్మించిందనేది అవాస్తవమని మేకప్ మెన్ చెప్పారని.. సత్యప్రియ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…