Actress Pragathi : వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. మదర్ పాత్రలకు ఆమె దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఒకప్పటి ఆమె ఈమేనా అన్న భావన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి ఫిట్‌నెస్ మీద దృష్టి సారించింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తోంది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రగతి తన జోరును పెంచింది. పెళ్లయి పిల్లలున్నా తాను ఇంకా కాలేజ్ గర్ల్ లాగా మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముద్ర పడిన ప్రగతి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది ప్రగతి. కట్ బనియన్స్ వేసుకుని చేస్తున్న వర్కౌట్స్ చూసి ఈ ఏజ్‌లో కూడా అస్సలు తగ్గట్లేదు, ఇరగదీస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరికొందరేమో ఆమె చేస్తున్న వర్కౌట్స్‌ను, ఫిట్ నెస్ పై ఆమెకున్న శ్రద్ధను అభినందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రగతి చాలా మారిపోయిందని చెప్పొచ్చు. కట్ స్లీవ్స్ జాకెట్స్ ధరించి పార్టీలకు హాజరవుతోంది. సినిమాల్లోనే కాకుండా పలు ఛానళ్లల్లో ప్రసారమయ్యే షోలకు హాజరై డ్యాన్సులు చేస్తోంది. తాజాగా మోకాళ్లపైకి తొడలు కనిపించేలా తెల్లని గౌను వేసుకుని నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది ప్రగతి. దిల్ సే సినిమాలోని చయ్యా చయ్యా సాంగ్‌కు మరొక లేడీతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫెంటాస్టిక్, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…