Actress Hema : అత‌ను అన్న మాట‌ల‌కు తీవ్ర‌మైన కోపం వ‌చ్చింది.. న‌టి హేమ‌..

February 3, 2022 10:49 PM

Actress Hema : టాలీవుడ్ సీనియ‌ర్ మోస్ట్ న‌టి హేమ ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. గ‌తంలో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో శివ బాలాజీ చేయి కొరికి ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఆ ఎన్నిక‌ల‌పై ఆమె మాట్లాడలేదు. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ఈమెకు సినిమాల్లో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. అనేక సినిమాల్లో న‌టించి ఇప్ప‌టికే మంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Actress Hema said that she was very angry on him at that time
Actress Hema

అయితే తాజాగా న‌టి హేమ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎదురైన అవ‌మానాల గురించి తెలియ‌జేసింది. సినిమా వాళ్లు అంటే స‌హ‌జంగానే ప్ర‌జ‌ల‌కు లోకువ అని చెప్పింది. తాను కెరీర్‌లో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాన‌ని.. అందుక‌నే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాన‌ని తెలిపింది.

ఇప్పుడు న‌టీన‌టులకు అన్ని సౌక‌ర్యాలు ఉండేలా కార‌వాన్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. కానీ ఒక‌ప్పుడు ఈ స‌దుపాయాలు ఏవీ ఉండేవి కావు. దీంతో బ‌ట్ట‌లు మార్చుకోవాల‌న్నా, టాయిలెట్స్‌కు వెళ్లాల‌న్నా.. ఇబ్బందిగా ఉండేది. ఇక ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో లంచ్ బ్రేక్ సంద‌ర్భంగా ఆ సినిమా డైరెక్ట‌ర్‌తో క‌లిసి భోజ‌నం చేస్తున్నా. ఆ స‌మ‌యంలో ప్రొడ‌క్ష‌న్ బాయ్ వ‌చ్చి నువ్వు ఇక్క‌డ తిన‌కూడ‌దు.. అక్క‌డికెళ్లి భోజ‌నం చెయ్యి.. అని అవ‌మానించాడ‌ని తెలిపింది.

అయితే అత‌ను అన్న మాట‌ల‌కు తీవ్ర‌మైన కోపం వ‌చ్చింద‌ని, అక్క‌డే ఉన్న టేబుల్‌ను ఎత్తి అత‌ని మీద ప‌డేద్దామ‌నుకున్నాన‌ని.. కానీ శాంతించాన‌ని చెప్పింది. అయితే ఇలాంటి వాళ్ల‌తో మాట‌లు ప‌డ‌డం ఎందుకు.. క‌ష్ట‌ప‌డితే మ‌నం ఉన్న‌త స్థాయికి చేరుకుంటాం క‌దా.. అని చెప్పి ఈ రంగంలో ఎంతో శ్రమించాన‌ని.. ఈ స్థానం దక్కించుకున్నాన‌ని చెప్పింది. అయితే ఆ ప్రొడ‌క్ష‌న్ బాయ్ ఇప్ప‌టికీ ఉన్నాడ‌ని, అత‌ను మ‌ళ్లీ ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో తానే వ‌చ్చి మ‌ర్యాద‌గా త‌న‌కు భోజ‌నం పెట్టాడ‌ని చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now