Balakrishna : బాలకృష్ణ నిజస్వరూపం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అర్చన..!

November 4, 2021 12:03 PM

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో చాలా మంది భయపడతారు. ఆయనకు గానీ తిక్క లేచిందంటే తన ఎదురుగా ఎవరున్నారనే విషయం పక్కన పెట్టి వారిపై దురుసుగా ప్రవర్తిస్తారని అందరూ భావిస్తారు. అయితే నిజానికి బాలకృష్ణ అలాంటి కోప్పడే వ్యక్తి కాదని, ఆయన ఎంతో మంచి వారని, పలువురు సెలబ్రిటీలు కూడా ఇదివరకు ఆయన నిజ స్వరూపం గురించి వెల్లడించారు. తాజాగా నటి అర్చన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ నిజస్వరూపం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

actress archana told about Balakrishna real character

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం పాండురంగడు. ఇందులో అర్చన సీత పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు తనని ఎప్పుడు సీత అని పిలుస్తుంటారని ఈమె తెలియజేశారు. ఈమె బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. సెట్‌లో బాలకృష్ణకి భయపడితే అస్సలు నచ్చదు.. అని తెలిపారు.

బాలకృష్ణ వ్యక్తిగతంగా ఎంతో మంచివారు అని.. ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటారని అర్చన పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఎదురుగా లేనిపోని డ్రామాలు వేస్తే మాత్రం ఆయన సహించరని, ఆయన వద్ద ఎంత ప్రశాంతంగా ఎంత నిజాయితీగా ఉంటే ఆయన అంత మంచిగా ఉంటారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలకృష్ణ గురించి అర్చన తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now