Anchor Devi : ఎన్నో కష్టనష్టాలని చవిచూస్తూ ఈ స్థాయికి వచ్చిన విశ్వక్ సేన్ లేని పోని వివాదంలో ఇరుక్కున్నాడు. టీవీ 9 యాంకర్ దేవితో జరిగిన లైవ్ డిబేట్ లో తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ప్రాంక్ వీడియో విమర్శల పాలైన నేపథ్యంలో.. దీనిపై డిబేట్ కోసం ఆ న్యూస్ ఛానల్ వారు విశ్వక్ ను స్టూడియోకి ఆహ్వానించారు. ఆ సమయంలోజరిగిన చర్చలో దేవి.. విశ్వక్ సేన్ ను పాగల్ సేన్ అని , అతనొక డిప్రెస్డ్ మ్యాన్ అని కామెంట్స్ చేసింది. దీంతో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విశ్వక్ సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గెట్ అవుట్ ఆఫ్ మై స్టుడియో.. అంటూ గట్టిగా అరిచింది దేవి.
దేవి కూడా విశ్వక్ సేన్‌పై నోరు పారేసుకుంది. ఈ క్రమంలో తనను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు టీవీ 9 యాంకర్ దేవిపై పరువు నష్టం దావా వేయాలని విశ్వక్ సేన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమెపై పరువు నష్టం కేసు ఫైల్ చేయడానికి ఇప్పటికే అతని లీగల్ టీమ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తనను అవమానించారంటూ విశ్వక్ సేన్ అభ్యంతరకరమైన బూతు పదాన్ని ఉపయోగించారు. సోమవారం సాయంత్రం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు మాట్లాడారు.
దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. నిజంగా అలానే వచ్చేసింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు, 16 ఏళ్ల వయసున్న యూత్ కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు సారీ అని అన్నారు. అయితే ఇంత రచ్చ కావడానికి కారణం విశ్వక్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రం వలనే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రాంక్ వీడియో చేయగా, అది రచ్చగా మారింది. విశ్వక్ సేన్ – రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 6న విడుదల కాబోతోంది. విద్యా సాగర్ చింతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు – సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
అయితే మరోవైపు దేవి కూడా విశ్వక్ సేన్‌పై ఇప్పటికే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…