Actor Vikram : బిగ్ బ్రేకింగ్‌.. హీరో విక్ర‌మ్‌కు గుండె పోటు..

Actor Vikram : ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ విక్ర‌మ్‌కు గుండె పోటు వ‌చ్చింది. ఆయ‌న స‌డెన్ గా గుండె పోటుకు గురి కావ‌డంతో వెంట‌నే ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం చెన్నైలోని కావేరి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వైద్యులు ఆయ‌న‌కు ఐసీయూలో చికిత్స‌ను అందిస్తున్నారు. కాగా ఆయ‌న పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రం ట్రైల‌ర్ లాంచింగ్‌కు గురువారం సాయంత్రం హాజరు కావ‌ల్సి ఉంది. కానీ ఇంత‌లోనే ఆయ‌న గుండెపోటు బారిన ప‌డ్డారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు స‌మాచారం.

విక్ర‌మ్ తెలుగు, త‌మిళంలో అనేక చిత్రాల్లో న‌టించారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న చేసిన అప‌రిచితుడు సినిమాకు గాను ఆయ‌న‌కు ఎంత‌గానో పేరు వ‌చ్చింది. ఆయ‌న త‌న త‌న‌యుడు ధ్రువ్ విక్ర‌మ్‌తో క‌ల‌సి చేసిన మ‌హాన్ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఆయ‌న ప్ర‌స్తుతం పొన్నియిన్ సెల్వ‌న్‌తోపాటు ప‌లు ఇత‌ర చిత్రాల్లోనూ న‌టిస్తున్నారు.

Actor Vikram

పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 1 మూవీలో ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌, కార్తి, జ‌యం ర‌వి, శ‌ర‌త్ కుమార్‌, త్రిష త‌దిత‌ర ప్ర‌ముఖులు న‌టించారు. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 30వ తేదీన రిలీజ్ కానుంది. అలాగే కోబ్రా అనే మ‌రో మూవీ ఆగ‌స్టు 11న రిలీజ్ కానుంది. దీంట్లో ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌, శ్రీ‌నిధి శెట్టి, మృణాళిని ర‌వి, కేఎస్ ర‌వికుమార్‌, మియా జార్జ్ త‌దిత‌రులు నటించారు. దీనికి ఇమైక్క నోడిగ‌ల్ ఫేమ్ ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శక‌త్వం వ‌హించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM