Acharya Movie : ఆచార్య ట్రైల‌ర్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ఎక్క‌డ ? అన్యాయం జ‌రిగిందంటున్న ఫ్యాన్స్‌..!

April 13, 2022 11:21 AM

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా వాయిదాల తర్వాత ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయనుంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి‌తోపాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు.

Acharya Movie trailer where is Kajal Aggarwal asking fans
Acharya Movie

ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డె నటించింది. అయితే తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌లో గెస్ట్ పాత్ర పోషించిన పూజా హెగ్డెని చూపించారు కానీ, ప్ర‌ధాన క‌థానాయిక అయిన కాజ‌ల్ ఒక్క ఫ్రేములో కూడా కనిపించ‌లేదు. ఈ విష‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ముందుగా ఆచార్య చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిషను తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆచార్యలో తన పాత్రకు కనీస ప్రాధాన్యత లేదనే కారణంగానే త్రిష తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాజ‌ల్‌కి మెగా ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం వ‌ల‌న ఆమెని ఎంపిక చేశారు. అయితే ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత త్రిష ఎందుకు త‌ప్పుకుంద‌నేది అర్ధ‌మైంది. కాజ‌ల్ కేవ‌లం రెమ్యునరేష‌న్ కోసమే ఈ సినిమా ఒప్పుకుంద‌ని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మెగాస్టార్ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా అద్భుతమైన ఎలివేషన్స్, చిరంజీవి మార్క్ వార్నింగ్స్, డైలాగ్స్ తో కొరటాల శివ.. ఆచార్య చిత్రాన్ని వడ్డించబోతున్నారు. సినిమా మొత్తం దేవాలయాలు, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు ఉంది. దీంతో చిత్రంపై భారీగా అంచ‌నాలు పెరిగాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now