Acharya Movie On OTT : భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆచార్య. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత చిరంజీవి ఆచార్యతో ప్రేక్షకులని పలకరించారు. ఇందులో రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటించడం విశేషం. భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. మూవీకి మిశ్రమ స్పందన లభిస్తున్న నేపథ్యంలో చాలా మంది మెగా అభిమానులు నీరసించిపోయారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఆచార్య మూవీ తొలి వారం హౌజ్‌ఫుల్‌తో దూసుకుపోతుందని విశ్వసిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో సినిమాలు విడులైన కొద్ది రోజులకే ఓటీటీలోకి వస్తుండగా, ఆచార్య మూవీ కూడా త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. థియేటర్లో విడులైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలోకి రానుందని సమాచారం.
అంటే మే చివరి వారం నుంచి ఆచార్య ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటించగా ఆయనకు జోడిగా పూజా హెగ్డె నటించింది. చిరు సరసన కాజల్ ని ఎంపిక చేసి ఆ తర్వాత తప్పించారు. ఆచార్య కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్ సెట్ వేసిన విషయం తెలిసిందే. దానికి ధర్మస్థలి అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు.
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…