Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత గురువారం తన 35వ బర్త్ డేను జరుపుకున్న విషయం తెలిసిందే. ఆమె బర్త్ డే రోజు సమంత నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఆచార్యకి పోటీగా బరిలో దిగింది. సమంత క్రేజ్‌తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు రాబడుతుందని మేకర్స్ భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు జీరో ఓపెనింగ్స్ రాబట్టింది. సమంత పేరు లేదా ఆమె ఫేస్ వాల్యూ సినిమా ఓపెనింగ్స్ పెంచవని దీంతో అర్ధమైంది.
హైదరాబాద్‌లోని దాదాపు 80 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా సింగిల్ స్క్రీన్‌లలో ఎవరూ రాకపోవడంతో ప్రదర్శనలను రద్దు చేశారు. తమిళనాడులో సైతం ఈ చిత్రం పెద్దగా ప్రశంసలు పొందలేకపోయింది. సమంత బర్త్ డే రోజు తన అభిమానులకి ఈ సినిమాతో వరస్ట్ ట్రీట్ ఇచ్చిందని అంటున్నారు. ముగ్గురు సౌతిండియన్ సూపర్ స్టార్స్ విజయ్ సేతుపతి, నయనతార, సమంతలు కలిసి నటించినా కూడా ఫలితం నెగెటివ్‌గా రావడం ఆశ్చర్యపరిచింది.
కాతువాకుల రెండు కాదల్ సినిమాని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా.. తెలుగులో ఈ చిత్రం కణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్‌తో విడుదలైంది. కణ్మని పాత్రలో నయనతార, రాంబోగా విజయ్ సేతుపతి, ఖతీజా కారెక్టర్‌లో సమంత నటించారు. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం, ఇద్దరితో కలిసి ఉండాలనుకునే హీరో స్టోరీనే ఈ సినిమా. ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉండటం వల్ల వచ్చే కష్టాలను విగ్నేశ్ శివన్ చూపించాడు. అయితే విడాకుల తరువాత విడుదలైన సమంత తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఉంటాయని ఆశించారు. కానీ సమంత పేరు సినిమాకు ప్రేక్షకులను రప్పించలేకపోయిందని స్పష్టమైంది. మరి త్వరలో విడుదల కానున్న ఆమె మిగిలిన సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…