Acharya Movie : ఆచార్య నుండి కాజ‌ల్ సీన్స్ పూర్తిగా లేపేశారా.. అస‌లు విష‌యం ఏంటి ?

April 25, 2022 12:13 PM

Acharya Movie : చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డె చిన్న పాత్ర పోషించింది. రామ్‌చరణ్‌కి జోడీగా చేసింది. చిరంజీవికి జోడీగా కాజల్‌ జత కట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. అయితే ఈ ప్ర‌మోష‌న్స్‌లో ఎక్క‌డ‌ కూడా కాజ‌ల్ ప్ర‌స్తావ‌న రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ట్రైల‌ర్‌లో కాజ‌ల్‌ని ఎక్క‌డా చూపించని చిత్ర బందం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఊసే ఎత్త‌లేదు.

Acharya Movie Kajal Aggarwal scenes completely removed
Acharya Movie

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ నుంచి మొద‌లు పెట్టి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డె ఎవ‌రూ అస‌లు కాజ‌ల్ గురించి మాట్లాడ‌లేదు. దీంతో ఫ్యాన్స్‌ ర‌క‌ర‌కాల అనుమానాలను వ్య‌క్తం చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జ‌రిగిందా ? లేదంటే కావాల‌నే కాజ‌ల్ పేరు మ‌రిచిపోయారా.. అంటూ సందేహాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్రను పూర్తిగా తొలగించిన‌ట్టు తెలుస్తోంది. క‌థానుగుణంగానే ఆమె స‌న్నివేశాల‌ని తొల‌గించార‌ని అంటున్నారు. అయితే లాహె లాహె సాంగ్‌లోని రెండు మూడు సీన్స్‌లో ఆమె ఉంటుంద‌ని తెలుస్తోంది.

కాజ‌ల్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసిన త‌ర్వాత చిత్ర బృందం ఆమెతో ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరించలేదు. అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చ‌కుండా కాస్త గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చేందుకు రెజీనాని తీసుకొచ్చారు. సినిమాలో హీరోయిన్ పార్ట్‌ని తొలగించి, ఆచార్యను బ్రహ్మచారిగా చూపించాలన్న కొరటాల నిర్ణయానికి చిరంజీవి కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కాజ‌ల్ స‌న్నివేశాల‌ని ఆచార్య నుండి తొల‌గించిన‌ట్టు టాక్. శనివారం హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి తదుపరి చిత్రాల దర్శకులు బాబీ, మెహర్ రమేష్, మోహన్ రాజా కూడా అతిథిలుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now