Acharya Movie : ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది ఇందుకే.. ఇవే ప్ర‌ధాన కార‌ణాలు..!

May 3, 2022 8:51 AM

Acharya Movie : కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. ఆచార్య‌. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుద‌లైన ఈ మూవీ డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొద‌టి రోజు నుంచే క‌లెక్ష‌న్లు పెద్ద‌గా రాలేదు. అయితే ఆచార్య మూవీ ఫ్లాప్ అవ‌డానికి ద‌ర్శ‌కుడు కొరటాల శివ‌నే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అంద‌రూ ఆయ‌న‌నే విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న చివ‌రి స‌మ‌యంలో చేసిన భారీ మార్పుల వ‌ల్లే సినిమా పోయింద‌ని అంటున్నారు. కానీ ఇదే కాదు.. ఆచార్య ఫ్లాప్ అవ‌డానికి ఇంకా పలు కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే..

Acharya Movie flop these are the main reasons
Acharya Movie

సినిమా క‌థ పాత‌ది కావ‌డం దీనికి పెద్ద మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు. అంద‌రూ మ‌హేష్ బాబు తీసిన శ్రీ‌మంతుడు మూవీ క‌థ‌కు ఇది కాపీ అని అంటున్నారు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం వ‌ల్ల స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి తగ్గిపోయింది. ఇక చివ‌రి నిమిషంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌హా ఆమెతో ఉన్న న‌టీన‌టుల సీన్స్‌ను కూడా లేపేశారు. దీంతో ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి త‌గ్గిపోయింది. సినిమా ఎలా ఉన్నా స‌రే మెగాస్టార్ ప‌క్క‌న హీరోయిన్ ఉండాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ ఆచార్య‌లో ఆయ‌న‌కు హీరోయిన్‌నే లేకుండా చేశారు. ఇది పెద్ద మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు.

ఇక చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లాంటి అగ్ర హీరోలు ఉన్నా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వాళ్ల‌ను చ‌క్క‌గా ఉప‌యోగించుకోలేక‌పోయారు. అక్కినేని హీరోలు తీసిన సినిమాల్లో తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధాల‌ను చ‌క్క‌గా చూపించారు. కానీ ఆచార్య‌లో అది కొర‌వడింది. వాళ్లిద్ద‌రూ తండ్రీ కొడుకులు అయి ఉంటార‌ని ఆశించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అయ్యారు. ఆచార్య ఫ్లాప్‌కు ఇది కూడా ఒక కార‌ణ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

గ‌తంలో చిరంజీవి సినిమాల‌కు మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతం అందించారు. ఆయ‌న పాట‌ల‌కు ఇచ్చిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండేది. కానీ చాలా ఏళ్ల త‌రువాత చిరంజీవి సినిమాకు ఆయ‌న‌ను తీసుకుని ప్ర‌యోగం చేయించారు. అది బెడిసికొట్టింది. మ్యూజిక్ ఏమాత్రం బాగాలేద‌ని అంటున్నారు. మెగాస్టార్ సినిమా అంటే ముందుగా మ్యూజిక్‌కే పెద్ద పీట వేస్తారు. కానీ ఇందులో అలా జ‌ర‌గ‌లేదు. దీని వ‌ల్ల కూడా సినిమాపై ఆస‌క్తి త‌గ్గిపోయింది.

ఇక చివ‌రిగా కేజీఎఫ్ 2. ఈ సినిమా ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. ఇంత‌లోపే ఆచార్య వ‌చ్చేసింది. దీంతో ప్రేక్ష‌కులు స‌హ‌జంగానే రెండు సినిమాల‌ను పోల్చుకున్నారు. కేజీఎఫ్ 2 స్థాయిలో ఆచార్య ఎలాగూ ఉండ‌దు క‌నుక‌.. దాన్ని ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించారు. కొద్ది రోజుల త‌రువాత ఆచార్య విడుద‌ల అయి ఉంటే ఫ‌లితం ఇంకోలా ఉండేద‌ని తెలుస్తోంది. మెగాస్టార్ త‌న సినిమా రిలీజ్ స‌మ‌యంలో ఇత‌ర సినిమాలు పోటీ ఉండ‌కుండా చూసుకుని ఉంటే బాగుండేద‌ని.. అందుక‌నే ఇలా జ‌రిగింద‌ని.. అంటున్నారు.

ఇలా క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లుగా.. ఆచార్య ఫ్లాప్ అవ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయి. కానీ వీటిని ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ ఏడాదిలో చిరంజీవి న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ ఆ త‌రువాత బోళా శంక‌ర్ చిత్రాలు వ‌రుస‌గా రిలీజ్ కానున్నాయి. మ‌రి వాటితోనైనా చిరంజీవి మెప్పిస్తారా.. లేదా.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now