Acharya Movie : ఆచార్య ఫ్లాప్ కి.. గాడ్‌ ఫాదర్‌ హిట్ కి కారణం అదేనా..?

October 7, 2022 8:26 AM

Acharya Movie : ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లూసిఫర్ కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీగా కలెక్షన్స్ రావాలంటే భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అంతా భావించారు. కానీ ఆచార్య సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించినా కూడా కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో అందరికీ తెలిసిందే. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా గాడ్ ఫాదర్ మొదటి రోజే రూ.38 కోట్లు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లాంగ్ రన్ లో కూడా ఈస్థాయి వసూళ్లు రాలేదని తెలిసిందే. అయితే ఇప్పుడు అంతా ఆచార్య సినిమా ఎందుకు సక్సెస్ కాలేదనే విశ్లేషణలో పడ్డారు. ఎక్కువమంది అభిప్రాయం ఏంటంటే.. గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చిరంజీవి ప్రమేయం ఎక్కువగా ఉంది. దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఇలా ప్రతి విషయంలో చిరంజీవి సలహాలు మరియు సూచనల మేరకు దర్శకుడు మోహన్ రాజా సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందట. కానీ ఆచార్య విషయంలో మాత్రం దర్శకుడు కొరటాల శివపై పూర్తి నమ్మకం ఉంచి చిరంజీవి ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదట.

Acharya Movie flop Godfather hit this may be the reason
Acharya Movie

ఆచార్య సినిమా సన్నివేశాలు లేదా ఎడిటింగ్ ఏ ఒక్క విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్‌మెంట్‌ అస్సలు లేదు. కానీ గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. చివరకు విలన్ పాత్రలో సత్యదేవ్ నటిస్తే బాగుంటుందని సూచించింది తానే అని చిరంజీవి పేర్కొన్నాడు. ఇంకా చాలా విషయాల్లో చిరంజీవి ఇన్ పుట్స్ ఉపయోగపడ్డాయని చిత్ర యూనిట్ అనధికారికంగా తెలిపారు. మొత్తానికి చిరు ఆచార్య డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి గాడ్ ఫాదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కి కూడా మంచి పండుగ గిఫ్ట్ ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now