RRR Movie : ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం రూ. 20 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారా.. నిజంగా షాకింగే..!

December 30, 2021 12:14 PM

RRR Movie : యావ‌త్ ప్ర‌పంచం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు మేక‌ర్స్. ముంబై, చెన్నైల‌లో ఇప్ప‌టికే ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వ‌హించిన చిత్ర బృందం రీసెంట్‌గా కేర‌ళ‌లో కూడా వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మం క‌న్నుల‌పండుగ‌గా జ‌రిగింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రానికి రూ.450 కోట్లు ఖర్చు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగానే క్లారిటీ ఇచ్చింది.

about rs 20 crores for RRR Movie promotions

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే దాదాపుగా రూ.20 కోట్లను ఖ‌ర్చు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టేందుకు రాజ‌మౌళి త‌న‌దైన శైలిలో ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు. ఈ సినిమాకు గాను ఆయ‌న 30 శాతానికి పైగా లాభాల్లో వాటా అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హీరోలిద్దరికీ కూడా సమానంగా పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఒక్కో హీరోకు రూ.45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలో కనిపించడంతో ఆయనకు రూ.25 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లుగా సమాచారం. ఆలియా భట్ రూ.9 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన బడ్జెట్లో దాదాపు రూ.200 కోట్ల వరకు నటీనటులకు, అలాగే ఇతర టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేశారట. సినిమా ప్రొడక్షన్ లో భాగంగా రూ.230 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now