Aasha Encounter : కల్పితం అంటూనే.. ఆశ ఎన్ కౌంటర్ ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ..!

October 31, 2021 4:53 PM

Aasha Encounter : రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు తీసినా కచ్చితంగా ఏదో ఒక వివాదానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే ఇది వరకు ఎన్నో వివాదాస్పదమైన చిత్రాలను తెరకెక్కించి వార్తల్లో నిలిచిన వర్మ 2016 నవంబర్ 26వ తేదీ జరిగిన దిశ అత్యాచార ఘటన గురించి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ను విడుదల చేశారు.

Aasha Encounter trailer launched by ram gopal varma

కోర్టు ఆదేశాల ప్రకారం వర్మ ఈ సినిమా టైటిల్ ను మార్చి ఆశ అని పెట్టి ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ఇది ఎవరినీ కించ పరచడం కోసం కానీ ఎవరినీ ఉద్దేశించి తీసిన చిత్రం కాదు, కేవలం కల్పితం అంటూనే.. ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌ వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాని కూడా అత్యాచార ఘటన జరిగిన తేదీన అంటే నవంబర్ 26వ తేదీన విడుదల చేయనున్నట్లు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఆశ అనే పాత్రలో సోనియా నటించగా, ఆనంద్ చంద్ర దర్శకత్వంలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్ పై ఈ సినిమా తెరకెక్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now