Aaradugula Bullet : గోపీచంద్ ఆర‌డుగుల బుల్లెట్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో..!

November 11, 2021 10:32 AM

Aaradugula Bullet : గోపీచంద్ ఇటీవ‌లి కాలంలో న‌టించిన సినిమాలు ఏవీ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. ఈ మ‌ధ్యే రిలీజ్ అయిన సీటీమార్ మూవీ కొంత మేర‌కు ఫ‌ర్వాలేద‌నుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌లేదు. ఇక ఎప్పుడో 4 ఏళ్ల కింద రిలీజ్ కావ‌ల్సిన ఆర‌డుగుల బుల్లెట్ మూవీని ఈ మ‌ధ్యే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు.

Aaradugula Bullet movie now streaming in amazon prime

కాగా ఆర‌డుగుల బుల్లెట్ మూవీ ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ప్రేక్ష‌కులు ఈ మూవీని అమెజాన్‌లో వీక్షించ‌వ‌చ్చు. ఇందులో గోపీచంద్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది. 4 ఏళ్ల కింద‌ట రిలీజ్ కావల్సిన ఈ మూవీ ఆర్థిక స‌మ‌స్యల కార‌ణంగా విడుద‌ల కాలేదు. అయితే తాజాగా థియేట‌ర్ల‌లో విడుద‌లైనా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

ఇక గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో అయినా గోపీచంద్ హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now