Aamir Khan : దేశం గర్వించదగ్గ నటులలో అమీర్ ఖాన్ తప్పక ఉంటారు. 2001లో విడుదలైన లగాన్ సినిమా అమీర్ ఖాన్ ని సూపర్ స్టార్ గా మార్చింది. 2007లో తారేజమీన్ పర్ సినిమాను తీసి తొలిసారి దర్శకుడిగా మారారు అమీర్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను స్థాపించారు. 2008లో తీసిన 3 ఇడియట్స్ బాలీవుడ్‌లో రూ.375 కోట్లు వసూలు చేసింది. ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. అయితే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవలే తన భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చి వార్తలలోకి ఎక్కారు.
అమీర్ మొదటగా 1986 లో రీనా దత్తాని పెళ్లి చేసుకుని సరిగ్గా 15 ఏళ్ళకే విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ తర్వాత 2005 సంవత్సరంలో కిరణ్ రావు ని వివాహం చేసుకొని అదే 15 ఏళ్ళకి మరోసారి విడాకులు తీసుకున్నారు. అయితే ఈసారి ఈ బాలీవుడ్ నటుడు విడాకులు తీసుకోడానికి కారణం మరొక బాలీవుడ్ హీరోయిన్ అని అటు సోషల్ మీడియాతోపాటు ఇటు బాలీవుడ్ లోనూ టాక్ వినిపిస్తోంది.
“దంగల్” చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురుగా నటించిన నటి ఫాతిమా సనా షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని అందువల్లనే ఆ నటికి ఆ తర్వాత చిత్రమైన “ది థగ్స్ అఫ్ హిందూస్తాన్” చిత్రంలో అమీర్ సరసన నటించడానికి అవకాశం కూడా ఇచ్చారని సమాచారం. ఫాతిమా.. అమీర్ ను కచ్చితంగా కలుస్తుందని, వీరిద్దరూ కలిసి చాలా పార్టీలకి కూడా హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం 29 ఏళ్ళు ఉన్న ఈ భామను 56 ఏళ్ల వయస్సు ఉన్న అమీర్ ఖాన్ ఇప్పుడు ఆమెని మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తుండగా, ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…