Aamani : సినిమా చాన్స్‌ అడిగితే గెస్ట్‌ హౌజ్‌కి రమ్మనేవాళ్లు.. ఆమ‌ని షాకింగ్ కామెంట్స్..

December 28, 2021 8:43 PM

Aamani : జంబలకిడిపంబ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలనాటి అందాల తార ఆమని. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెర‌కెక్కించిన ఈ సినిమాతో ఆమని కెరీరే మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆమె మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె సహాయ నటి పాత్రలు పోషిస్తూ మరోవైపు ధారావాహికల్లోనూ నటిస్తోంది.

Aamani said that when she asked movie chance they asked her to come to guest house

అయితే హీరోయిన్స్ ప‌లు సంద‌ర్భాల‌లో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోగా, ఈ మ‌ధ్య ఆ విష‌యాల‌పై మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా ఆమ‌ని ఆమె సినీ కెరీర్లో ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాను అని ఆమె వెల్లడించింది. సినిమాలో నటించే ఆసక్తి ఉందని కొందరిని సంప్రదిస్తే.. వాళ్లు అంతా ఓకే అన్నాక.. గెస్ట్ హౌస్ కి వచ్చేయ్ అనే వాళ్లు .. దీంతో నాకు గెస్ట్ హౌస్ అంటేనే అనుమానం వచ్చింది.

నువ్వు ఒక్క‌దానివే రా, మీ అమ్మను తీసుకురాకు అని చెప్పేస‌రికి వారి మ‌న‌సులో ఎలాంటి ఫీలింగ్ ఉందో అర్ధ‌మై దూరంగా ఉండేదానిని అని ఆమ‌ని చెప్పుకొచ్చింది. ఈవిడ‌కి అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవలే చావు కబురు చల్లగా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. బుల్లితెర‌పై కూడా తన టాలెంట్ ను చూపిస్తూ మెప్పిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now