Indigestion : తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేదా ? ఈ 8 చిట్కాల‌ను పాటించండి..!

Indigestion : జీర్ణ స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. చాలా మంది తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేద‌ని చెబుతుంటారు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణ స‌మస్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..

1. తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు బేకింగ్ సోడా బాగా ప‌నిచేస్తుంది. కొన్ని సార్లు జీర్ణాశ‌యంలో యాసిడ్లు అధికంగా ఉత్ప‌త్తి అవ‌డం వ‌ల్ల కూడా తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ‌దు. అలాంటి స‌మ‌యంలో ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా క‌లిపి తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.

2. భోజ‌నం చేసిన అనంత‌రం ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి బాగా క‌లిపి తాగాలి. రాత్రి పూట ఇలా చేయాలి. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.

3. భోజనం చేయ‌డానికి ముందు ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవించాలి. రోజుకు 3 పూట‌లా ఇలా చేయాలి. దీంతో 3 రోజుల్లో జీర్ణ‌శ‌క్తి మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

4. భోజ‌నం అనంత‌రం సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని న‌ములుతుండాలి. దీని వ‌ల్ల కూడా ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ కూడా ఉండ‌వు.

5. నాలుగు, ఐదు పుదీనా ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని ఒక క‌ప్పు మోతాదులో రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా పుదీనా హెర్బ‌ల్ టీని తాగుతుంటే జీర్ణ శ‌క్తి పెరుగుతుంది.

6. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక క‌ప్పు మోతాదులో వాము నీళ్ల‌ను తాగుతుంటే జీర్ణ స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వాము గింజ‌ల‌ను వేసి 10 నిమిషాల పాటు మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. ఇలా ప‌ర‌గ‌డుపునే రోజూ తాగుతుంటే అన్ని ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

7. వాము నీళ్ల‌లాగే ధ‌నియాలు లేదా జీల‌క‌ర్ర నీళ్లు కూడా ప‌నిచేస్తాయి. ప‌ర‌గ‌డుపునే ఈ నీళ్ల‌ను కూడా తాగ‌వ‌చ్చు. జీర్ణ శ‌క్తి పెరుగుతుంది.

8. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను సేవించాలి. ఇలా రోజూ తీసుకుంటే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM