Today Gold Rate : గత కొంత కాలంగా బంగారం ధరల్లో భారీగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంత కాలం పాటు బంగారం ధర స్థిరంగానే ఉంది. కానీ ఒక్కోసారి భారీగా తగ్గుతోంది. ఇక నిన్న మొన్నటి వరకు స్థిరంగానే ఉన్న ధర మళ్లీ తగ్గింది. ఇది మహిళలకు శుభవార్తే అని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ముహూర్తాలు అనేకం ఉన్నాయి. శుభ కార్యాలు జరుపుకునేవారు కూడా ఉన్నారు. దీంతో తగ్గుతున్న బంగారం ధరలు వారికి ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడే దాన్ని కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు.
ఇక 27 జూలై 2022న బంగారం ధరలు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గింది. దీంతో రేటు రూ.50,780గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.320 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.46,580గా ఉంది. ఇక వెండి ధర కూడా బంగారంలాగే ఉంటోంది. ఈ క్రమంలోనే దీని ధర కిలోకు రూ.300కు పడిపోగా.. ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ.60,800గా ఉంది. గత 4 రోజుల్లోనే వెండి ధర రూ.800 తగ్గడం విశేషం.
ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,580గా ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం ధర 50,780గా ఉంది. ఈ నగరంలో వెండి ధర కిలో రూ. 60,800 వద్ద ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780గా కొనసాగుతోంది.
అదేవిధంగా చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,280గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.51,580గా కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉన్నాయి. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780గా ఉన్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780, కోల్ కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580గా ఉన్నాయి. ఈ క్రమంలోనే తగ్గుతున్న పసిడి ధరలు మహిళలకు ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…