OTT : ఓటీటీ ప్రేక్ష‌కులారా.. పండుగ చేసుకోండి.. ఒక్కటే రోజు.. ఏకంగా 19 సినిమాలు..!

July 16, 2022 10:36 PM

OTT : క‌రోనా పుణ్య‌మా అని ఓటీటీ యాప్ లు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పండుగ చేసుకుంటున్నాయి. థియేట‌ర్ల‌లో డ‌బ్బులు బాగా పెట్టి చూడ‌డం క‌న్నా ఓటీటీల్లో చూడ‌డ‌మే బెస్ట్ అని ప్రేక్ష‌కులు చాలా మంది ఫీల‌వుతున్నారు. అందుక‌నే ప్ర‌తివారం థియేట‌ర్ల‌కు పోటీగా ఓటీటీల్లోనూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్ల క‌న్నా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మూవీలే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్న సినిమాలు చాలా త్వ‌ర‌గా ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్ష‌కులు వారం వారం పండుగ చేసుకుంటున్నారు.

ఇక గ‌తంలో ఫ్లాప్ టాక్ వ‌చ్చిన మూవీల‌ను ప్రేక్ష‌కులు కేవ‌లం టీవీల్లోనే చూసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల్లో 3 వారాలు తిర‌గ‌క‌ముందే చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓటీటీ సంస్థ‌లు కూడా సినిమాల‌కు చెందిన డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేయ‌డంలో పోటీలు ప‌డుతున్నాయి. ఇక ఓటీటీల్లో జూలై 15వ తేదీ ఒక్క‌టే రోజు 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

19 movies released on OTT in single day
OTT

అమెజాన్ ప్రైమ్‌లో కామిక్ స్థాన్ అనే మూవీ రిలీజ్ కాగా.. నెట్ ఫ్లిక్స్‌లో జాదూగ‌ర్ (హిందీ), బ్యాక్ స్ట్రీట్ రూకీ, రీ మ్యారేజ్ & డిజైర్స్, మామ్ డోంట్ డు దట్, అల్బా, ఫార్జార్, పెర్సుయేషన్, కంట్రీ క్వీన్ అనే మూవీలు రిలీజ్ అయ్యాయి. అలాగే జీ5 యాప్‌లో.. మా నీళ్ల ట్యాంక్, వీట్ల విశేషం (తమిళం), జనహిత్ మే జారీ (హిందీ), కోల్కతార్ హ్యారి (బెంగాలీ), కుంజెల్దో(మలయాళం) అనేవి రిలీజ్ అయ్యాయి.

ఇక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో శూర్ వీర్ (హిందీ-సిరీస్ 1) స్ట్రీమ్ అవుతుండ‌గా.. ఆహాలో సమ్మతమే, మామణితాన్, యంగర్ (ఇంగ్లీష్ – సిరీస్ సీజన్ 1) రిలీజ్ అయ్యాయి. ఇక ఎక్స్ ఈక్వల్స్ టు ప్రేమ్ మూవీ హోయ్ చోయ్ లో రిలీజ్ అయింది. అయితే వీటిల్లో ఒక‌టి రెండు సిరీస్ లు ఉన్నా మిగిలిన‌వి అన్నీ సినిమాలే కావ‌డం విశేషం. దీంతో ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు ఫుల్ వినోదం ల‌భ్యం కానుంది.

ott

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now