Today Gold Rates : బ్యాడ్ న్యూస్‌.. పెరిగిన బంగారం ధ‌ర‌లు..

April 19, 2022 10:26 AM

Today Gold Rates : గత కొద్ది రోజుల కింద‌ట బంగారం ధ‌ర‌లు తగ్గుతూ వ‌చ్చాయి. కానీ మ‌ళ్లీ ప‌సిడి ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల నుంచి ధ‌ర‌లు కాస్త పెర‌గ‌డం లేదా స్థిరంగా ఉండ‌డం.. వంటివి జ‌రిగాయి. కానీ దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డ చూసినా పెరిగిన రేట్ల‌కే బంగారాన్ని విక్ర‌యిస్తున్నారు. ఇక ఇవాళ అమ‌లు చేస్తున్న బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధ‌ర ఢిల్లీలో రూ.49,850 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.54,380గా ఉంది. అలాగే ముంబైలో ఈ ధ‌ర వ‌రుస‌గా రూ.49,850, రూ.54,380గా ఉన్నాయి.

19 April 2022 Today Gold Rates  in India
Today Gold Rates

హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49, 850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54, 380 గా ఉంది. విజయవాడలో రూ.49, 850, రూ.54, 380 గా బంగారం ధ‌ర‌లు ఉన్నాయి. ఇలా బంగారం ధ‌ర‌లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతోపాటు వెండి ధ‌ర‌లు కూడా అలాగే పెరుగుతున్నాయి.

ఇవాళ వెండి ధ‌ర కిలోకు రూ.75, 200 గా ఉంది. అయితే మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. నిమిష నిమిషానికి మారుతుంటాయి. క‌నుక బంగారం, వెండి కొనుగోలు చేసే వారు ఆ స‌మ‌యంలో ఉండే ధ‌ర‌ల‌ను మ‌రోసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దేశంలో మళ్లీ క‌రోనా వేవ్ వ‌స్తుంద‌ని అంటుండ‌డంతో బంగారం ధ‌ర‌లు ఇంకా పెరుగుతాయ‌నే అంటున్నారు. ఈ విష‌యాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now