Vijay Devarakonda : అనుపమ పరమేశ్వరన్ అందానికి ముగ్దుడైన విజయ్ దేవరకొండ..!

October 29, 2021 5:57 PM

Vijay Devarakonda : సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు కొంతమంది హీరోయిన్లు ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ని సంపాదిస్తారు. ఈ సినిమాల వల్ల సినీ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆకట్టుకుంటారు. అలాగే తన మెస్మరైజింగ్ గ్లామర్ లుక్స్ తో ఎంతోమంది అభిమానుల్ని ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచింది. తన లేటెస్ట్ లుక్స్ తో ఎంతో మంది హీరోలకు మంచి ఫీలింగ్ ను అందించింది. ఆమె అందం, నటనకు మెస్మరైజ్ అయ్యాడు విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda mesmerized by anupama parameshwarans beauty

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, తన అందమైన కర్లీ హెయిర్ తో అంతకన్నా అందమైన స్మైల్ తో కుర్రకారుని ఇట్టే ఆకట్టుకుంటోంది. 2015 లో ఆమె ఫస్ట్ మలయాళం సినిమా ప్రేమమ్ తో టాలీవుడ్ సినీ అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా అ.. ఆ.. తో తెలుగు ప్రేక్షకులకు ఇంకాస్త చేరువైంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా.. ఆమెకు అనుకున్నంత స్థాయిలో పేరు రాలేదు.

అలాగే ఆ తర్వాత అవకాశాలు అంతగా రాలేదు. లేటెస్ట్ గా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా వర్క్ చేస్తోంది. దీంతోపాటు మరిన్ని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తోంది. రీసెంట్ గా అనుపమ బరువు తగ్గిన క్రమంలో ఆమె గ్లామర్ లుక్ ని చాలా నీట్ గా ప్రజంట్ చేస్తూ ఎంటర్ టైన్ చేసింది. వీరిలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ ఫోటోల్ని చూసి ఆమె అందం, నటనకు అట్రాక్ట్ అయ్యారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న నెక్ట్స్ సినిమాలో అనుపమతో జోడి కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కనుక సెట్ అయ్యిందంటే ఆమె కెరీర్ లో ఓ రేంజ్ లో టర్న్ అవుతుందని సినీ ప్రముఖులు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now