Mango Ice Cream : ఎండ‌ల‌కు చ‌ల్ల చ‌ల్ల‌ని మ్యాంగో ఐస్ క్రీమ్‌.. ఇలా చేశారంటే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

May 7, 2024 5:34 PM

Mango Ice Cream : వేస‌వికాలంలో మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో ఐస్ క్రీమ్స్ కూడా ఒక‌టి. ఐస్ క్రీమ్స్ ను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్స్ ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అయితే బ‌య‌ట కొనే ప‌ని లేకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎటువంటి ఫ్రిజ‌ర్వేటివ్స్ లేకుండా చాలా సుల‌భంగా దీనిని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం మూడంటే మూడు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ఈ ఐస్ క్రీమ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా సుల‌భంగా ఇంట్లోనే రుచిగా మ్యాంగో ఐస్ క్రీమ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాంగో ఐస్ క్రీమ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఫ్రెష్ క్రీమ్ – 250 ఎమ్ ఎల్, పంచ‌దార పొడి – 4 లేదా 5 టీ స్పూన్స్, త‌రిగిన మామిడిపండు – 1, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు.

Mango Ice Cream recipe make in this method very easy
Mango Ice Cream

మ్యాంగో ఐస్ క్రీమ్ త‌యారీ విధానం..

ముందుగా ఫ్రెష్ క్రీమ్ ను అర‌గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి బ‌య‌ట‌కు తీయాలి. మామిడిపండును ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో ప్రెష్ క్రీమ్, పంచ‌దార పొడి, మామిడిపండు ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ క‌ల‌ర్ ఫుల్ గా ఉండాల‌నుకునే వారు ఫుడ్ క‌ల‌ర్ ను వేసుకుని మ‌రోసారి మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బాక్స్ లోకి తీసుకుని మూత పెట్టి 4 నుండి 5 గంట‌ల పాటు డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి. త‌రువాత ఐస్ క్రీమ్ ను బ‌య‌ట‌కు తీసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఇంట్లోనే చాలా సుల‌భంగా మ్యాంగో ఐస్ క్రీమ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now