lifestyle

Iron Foods : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో ఐర‌న్ లోపం ఉన్న‌ట్లే..!

Iron Foods : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ముఖ్య‌మైన పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఐర‌న్ మ‌న శ‌రీరంలో అనేక విధులు నిర్వ‌ర్తిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌, ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి స‌హాయ ప‌డుతుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజ‌న్ శ‌రీరంలోని క‌ణాల‌కు చేరేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు ఎల్ల‌ప్పుడూ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అలాగే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. అయితే త‌గినంత‌గా ఐర‌న్ లేక‌పోతే మ‌న శ‌రీరం ఆరోగ్య‌క‌ర‌మైన ఎర్ర ర‌క్త క‌ణాల‌ను త‌యారు చేయ‌లేదు. దీంతో ఐర‌న్ లోపం త‌లెత్తుతుంది. ఫ‌లితంగా మ‌న శ‌రీరం ప‌లు ల‌క్ష‌ణాల‌ను మ‌న‌కు తెలియజేస్తుంది. ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఐర‌న్ అవ‌స‌రం. అయితే ఐర‌న్ త‌గినంత‌గా ల‌భించ‌న‌ప్పుడు హిమోగ్లోబిన్ స‌రిగ్గా ఉత్ప‌త్తి కాదు. దీంతో శ‌రీరంలోని క‌ణాల‌కు స‌రిగ్గా ఆక్సిజ‌న్ ల‌భించ‌దు. ఫ‌లితంగా మ‌నం తీవ్రంగా అల‌సిపోయిన‌ట్లు ఫీల‌వుతాం. అలాగే నీర‌సంగా కూడా ఉంటుంది. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఐర‌న్ లోపం వ‌చ్చింద‌ని తెలుసుకోవాలి. ఐర‌న్ లోపం ఉంటే ఎర్ర ర‌క్త క‌ణాలు స‌రిగ్గా ఉత్ప‌త్తి కావు. క‌నుక చ‌ర్మం ఎరుపు రంగు నుంచి పాలిపోయిన తెలుపు రంగులోకి మారుతుంది. ఇలా గ‌న‌క ఉంటే క‌చ్చితంగా ఐర‌న్ లోపించింద‌ని గుర్తించాలి.

Iron Foods

ఐర‌న్ లోపిస్తే హిమోగ్లోబిన్ స‌రిగ్గా ఉత్ప‌త్తి కాదు క‌నుక శ‌రీరంలోని క‌ణాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా ల‌భించ‌దు. దీంతో క‌ణాలు ఆక్సిజ‌న్ కోసం చూస్తుంటాయి. కానీ ఆక్సిజ‌న్ ల‌భించే అవ‌కాశం ఉండ‌దు క‌నుక మ‌న‌కు శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. అలాగే ఐర‌న్ లోపించిన వారిలో గుండె అసాధార‌ణ రీతిలో కొట్టుకుంటుంది. దీంతోపాటు రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వ‌స్తుంది. దీని వ‌ల్ల కాళ్ల‌ను ఆడిస్తూ ఉండాల్సి వ‌స్తుంది. అలాగే ఐర‌న్ లోపం ఉన్న‌వారిలో త‌ల‌నొప్పి, త‌ల తిర‌గ‌డం వంటి ల‌క్ష‌ణాలు కూడా కనిపిస్తాయి.

ఐర‌న్ లోపించిన వారిలో చేతులు, పాదాలు చ‌ల్ల‌గా ఉంటాయి. గోర్లు విరిగిపోతాయి, వెంట్రుక‌లు చిట్లిపోతాయి. నోట్లో, నాలుక‌పై ఎర్ర‌గా క‌నిపిస్తుంది. ఆక‌లి ఉండ‌దు. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే ఐర‌న్ లోపం ఉంద‌ని గుర్తించాలి. వెంట‌నే ఐర‌న్ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఐర‌న్ మ‌న‌కు ఎక్కువ‌గా మ‌ట‌న్‌, రాజ్మా, దానిమ్మ పండ్లు, యాపిల్ పండ్లు, బాదం ప‌ప్పు, ట‌మాటాలు, బ్రొక‌లీ, పాల‌కూర‌, వాల్ న‌ట్స్‌, ఓట్స్‌, ప‌ప్పు దినుసులు, తృణ ధాన్యాల్లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ఐర‌న్ లోపం త‌గ్గుతుంది. దీంతో పైన తెలిపిన ల‌క్ష‌ణాలు అన్నీ మాయం అవుతాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM