Immunity Foods : మీ ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవి.. రోజూ తినాలి..!

May 28, 2024 11:28 AM

Immunity Foods : రోజుకో రకం రోగాలు మ‌న‌ల్ని చుట్టుముడుతున్నాయి. ఏ రోగ‌మైనా మొట్ట‌మొద‌ట రోగ నిరోధ‌క శ‌క్తి (ఇమ్యూనిటీ)పైనే దాడి చేసి గెలిచి మ‌న శ‌రీరాన్ని ఆక్ర‌మిస్తాయి. ప్ర‌స్తుతం చాలా ర‌కాల వైర‌స్‌లు, బాక్టీరియాలు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. మ‌న‌ల్ని భ‌యపెడుతున్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అందుకోసం ఏవేవి తీసుకోవాలంటే.. న‌ల్ల‌ద్రాక్ష‌, వేరుశ‌న‌గ‌లు, పిస్తా, మ‌ల్బ‌రీస్‌, స్ట్రా బెర్రీల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అదేవిధంగా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే జామ‌కాయ‌లు, బ‌త్తాయి, నారింజ‌, నిమ్మ‌కాయ‌, క్యాప్సిక‌మ్‌ల‌ను కూడా తినాలి.

కెరోటినాయిడ్ ఉన్న ఆహార ప‌దార్థాలు.. అన‌గా చిల‌గ‌డ‌దుంప‌లు, బొప్పాయి, క్యారెట్ వంటి వాటిని కూడా తీసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, ప‌సుపు, మిరియాలు, ఆకుకూర‌లు ముఖ్యంగా మున‌గాకు తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వైర‌స్‌, ఇత‌ర వ్యాధుల ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్పుడు ఈ కింది వంట‌కం చేసుకుని తీసుకోండి. దీన్ని అన్ని వ‌య‌స్సుల వారు తిన‌వ‌చ్చు.

Immunity Foods take these daily to increase it
Immunity Foods

కావ‌ల్సిన‌వి

పాలు, ప‌సుపు, శొంఠి, మిరియాలు, తుల‌సి, యాల‌కులు, ఎండు ఖ‌ర్జూరాలు.

త‌యారీ

మూడు ఎండు ఖ‌ర్జూరాల‌ను పొడి చేసి అందులో అర టీస్పూన్ ప‌సుపు, చిటికెడు శొంఠి, 10 మిరియాలు, చిటికెడు యాల‌కుల పొడి వేసి మిశ్ర‌మంగా చేయాలి. ఒక గిన్నెలో ఈ పొడి వేసి కొన్ని నీళ్లు పోసి మ‌రిగించాలి. వేరే గిన్నెలో గ్లాసు పాలు పోసి మరిగించి ఈ పాల‌ల్లో మ‌రిగించిన పొడి వేసి నురుగు వ‌చ్చేట్లు అటు ఇటు గిన్నెల్లోకి మార్చుకుని ఫిల్ట‌ర్ చేసి తాగాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now