lifestyle

Longer Life : ఎక్కువ ఏళ్ల పాటు జీవించాలంటే.. ఇలా చేయండి..!

Longer Life : వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఒక దాని వెనుక ఒకటి వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో ఆయా సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంటుంది. ఇక చివరకు ఏదో ఒక రోజుకు ఎవరైనా చనిపోక తప్పదు. అయితే ఎక్కువ కాలం బతకాలనుకునేవారు మాత్రం నిత్యం తక్కువ ఆహారం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనలు సదరు విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

అమెరికా, చైనాలకు చెందిన కొందరు సైంటిస్టులు ఎలుకలపై ఇటీవలే పలు ప్రయోగాలు చేశారు. కొన్ని ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. వాటిలో కొన్నింటికి సాధారణ ఆహారం ఇచ్చారు. కొన్నింటికి మొదటి గ్రూపు కన్నా 30 శాతం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం ఇచ్చారు. అంటే ఆ ఎలుకలు నిత్యం తినాల్సిన దానికన్నా తక్కువ ఆహారం తిన్నాయన్నమాట. ఈ క్రమంలో కొన్ని రోజుల తరువాత వాటిలోని పలు అవయవాల కణాల పనితీరును పరిశీలించారు. చివరకు వెల్లడైందేమిటంటే.. నిత్యం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకున్న రెండో గ్రూప్‌నకు చెందిన ఎలుకల్లో ఆయా అవయవాల కణాలు క్షీణించే రేటు తక్కువైందట. అంటే ఆ కణాల వయస్సు చాలా నెమ్మదిగా పెరిగిందట. ఆ కణాలు చాలా ఎక్కువ రోజుల పాటు జీవించి ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో నిత్యం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ రోజుల పాటు బతకవచ్చని సైంటిస్టులు తేల్చారు.

Longer Life

కాగా సైంటిస్టులు చేపట్టిన సదరు పరిశోధనకు చెందిన వివరాలను సెల్‌ అనే ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు. ఈ క్రమంలో సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. నిత్యం చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం పాటు జీవించవచ్చని, అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని, మెటబాలిజం క్రమబద్దీకరింపబడుతుందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM