Chicken Curry : చికెన్ కర్రీ.. మనలో చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చికెన్ కర్రీని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా బగారా అన్నంలోకి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, కమ్మగా తేలికగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి…. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట – 1, జీడిపప్పు – 10, నూనె – 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చికెన్ – అరకిలో, కరివేపాకు – 2 రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 3 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ముందుగా జార్ లో టమాట, జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత చికెన్, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఈ చికెన్ ను నూనె పైకి తేలే వరకు బాగా వేయించిన తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ ఉడికిన తరువాత గరం మసాలా వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…