lifestyle

Mutton : మ‌ట‌న్ కొంటున్నారా.. అయితే మ‌ట‌న్ మంచిగా ఉందో లేదో ఈ చిట్కాల‌ను పాటించి గుర్తించండి..!

Mutton : నేడు న‌డుస్తున్న‌ది ఆధునిక యుగం మాత్ర‌మే కాదు. క‌ల్తీ యుగం కూడా. అస‌లు అది, ఇది అని తేడా లేకుండా ప్ర‌స్తుతం అన్ని ఆహారాల‌ను క‌ల్తీ చేస్తున్నారు. దీంతో ఏది కల్తీ కాదో గుర్తించ‌డం మ‌న‌కు చాలా క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అయితే క‌ల్తీ విష‌యానికి వ‌స్తే.. మ‌నం తినే నాన్‌వెజ్ ఐట‌మ్ అయిన మ‌టన్‌లో అది ఇంకా ఎక్కువ జ‌రుగుతుంది. అంటే.. కుళ్లిపోయిన మాంసం అమ్మ‌డ‌మో, బాగా కొవ్వు ఉన్న కూర అమ్మ‌డ‌మో .. లేదా ఎప్పుడో క‌ట్ చేసిన మ‌ట‌న్‌ను అమ్మ‌డ‌మో చేస్తుంటారు. దీంతో మ‌నం మోస‌పోవాల్సి వ‌స్తుంది. అయితే అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. కింద చెప్పిన సూచ‌న‌లు పాటించాలి. దీంతో మ‌ట‌న్‌లో క‌ల్తీని గుర్తించ‌డం చాలా తేలిక‌వుతుంది. మరి ఆ సూచ‌న‌లు ఏమిటంటే..

మంచి మ‌ట‌న్ చాలా తాజాగా క‌నిపిస్తుంది. అదే మంచి మ‌ట‌న్ కాక‌పోతే పాలిపోయి, ఎండిపోయినట్లుగా ఉంటుంది. మంచి మ‌ట‌న్ మ‌న‌కు జ్యూసీగా క‌నిపిస్తుంది. మ‌ట‌న్ నుంచి ర‌క్తం, నీరు కారుతుంటే దాన్ని తీసుకోకూడ‌దు. బాగా ఎరుపు రంగులో మ‌ట‌న్ ఉంటే అందులో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అది ముదిరిపోయిన మ‌ట‌న్ అని గ్ర‌హించాలి. గులాబీ, ఎరుపు మ‌ధ్య రంగులో ఉండే మ‌ట‌న్ అయితే శ్రేయ‌స్క‌రం.

Mutton

చాలా మంది బోన్‌లెస్ మ‌టన్‌ను తింటుంటారు. అయితే బోన్‌లెస్ క‌న్నా విత్ బోన్ మ‌ట‌నే రుచిగా ఉంటుంది. పైగా బోన్స్ మ‌ట‌నే త్వ‌ర‌గా ఉడుకుతుంది. దీనికి తోడు బోన్స్ మ‌ట‌న్‌లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. క‌నుక బోన్స్ మ‌ట‌న్‌నే ఎక్కువ‌గా తినాలి. ఆన్‌లైన్‌లో మ‌ట‌న్‌ను ఎప్పుడూ ఆర్డ‌ర్ ఇవ్వ‌రాదు. ఎందుకంటే.. వాళ్లు ఎలాంటి మ‌ట‌న్ తెస్తారో మ‌న‌కు తెలియ‌దు క‌దా. మార్కెట్ లో అయితే మనం మ‌ట‌న్‌ను చూసి.. మ‌న‌కు న‌చ్చితేనే కొంటాం. కానీ ఆన్‌లైన్‌లో ఆ అవ‌కాశం ఉండ‌దు. క‌నుక ఎప్పుడూ ఆన్‌లైన్ లో మ‌ట‌న్‌ను ఆర్డ‌ర్ చేయ‌రాదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM