Green Gram For Beauty : పెసలను కొందరు ఉడకబెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. ఇక కొందరు వాటిని నానబెట్టి, మొలకెత్తించి తింటారు. కొందరు కూర చేసుకుంటారు. అయితే ఎలా తిన్నా.. పెసల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వాటితో పలు చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు. అంతే కాదు, ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పెసల వల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట కొన్ని పచ్చిపాలను తీసుకుని వాటిలో కొన్ని పెసలను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేయాలి. దాన్ని ఫేస్‌ప్యాక్‌గా మార్చుకుని ముఖానికి రాయాలి. 15 – 20 నిమిషాలు ఆగాక ప్యాక్ డ్రై అవ్వగానే నీటితో కడిగేయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ ప్యాక్ ఎంతగానో మేలు చేస్తుంది.
రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని పెసలను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని మిక్సీ పట్టి పేస్ట్‌లా మార్చుకోవాలి. ఆ మిశ్రమంలో అర టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి దాన్ని ముఖంపై అప్లై చేయాలి. ముఖంపై ఆ మిశ్రమాన్ని సున్నితంగా రాస్తూ మర్దనా చేయాలి. తరువాత 10 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు.
ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పెసలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్‌లా చేసుకుని అందులో చల్లని పెరుగు లేదా అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖంపై లేదా శరీరంలోని ఇతర ప్రదేశాలపై అప్లై చేయాలి. 5-10 నిమిషాలు ఆగాక చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఎండలో కందిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…