Tea And Coffee : మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే తమ రోజును టీతో ప్రారంభిస్తారు. అలాగే కొందరు ఉదయాన్నే కాఫీ తాగుతారు. టీ, కాఫీ రెండింటిలోనూ కెఫీన్ అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రులను చూసి కొందరు పిల్లలు కూడా ఉదయం టీ, కాఫీ వంటివి తాగుతారు. అవేవీ అనారోగ్యకరమైనవి కావు కనుక, పిల్లలకు వారి తల్లిదండ్రులు టీ, కాఫీ ఇస్తుంటారు. అయితే వాస్తవానికి పిల్లలు టీ, కాఫీ తాగకూడదు. ఆ వయస్సులో వారు ఆ పానీయాలను తాగడం అంత మంచిది కాదు. చిన్నారులు టీ లేదా కాఫీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ లేదా కాఫీ.. రెండింటిలో ఏది తీసుకున్నా సరే.. అందులో కెఫీన్‌తోపాటు టానిన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చిన్నారులకు అసలు మంచిది కాదు. ఇవి వారి ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే వారు టీ లేదా కాఫీని చిన్నతనంలోనే తాగడం వల్ల వాటిల్లో ఉండే చక్కెర వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
పిల్లలకు కనీసం 12 ఏళ్లు వచ్చే వరకు టీ, కాఫీ ఇవ్వకూడదు. అలా ఇస్తే వారిలో క్యాల్షియం లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీంతో వారిలో ఎదుగుదల సరిగ్గా ఉండదు. అలాగే ఎముకలు బలహీనంగా మారుతాయి. దీంతో ఆ వయస్సులో ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చిన్నారుల్లో దంత క్షయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో దంతాలు పుచ్చిపోయి ఇబ్బందులను కలగజేస్తాయి. కనుక చిన్నారులకు కనీసం 12 ఏళ్లు వచ్చే వరకు టీ, కాఫీ అలవాటు చేయకూడదు. లేదంటే సమస్యలను సృష్టించిన వారు అవుతారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…