lifestyle

Sleep : రాత్రి పూట చ‌క్క‌గా నిద్రించాలంటే.. ఈ సూచ‌న‌లు పాటించాల్సిందే..!

Sleep : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు క‌చ్చితంగా నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇది నిజ‌మే. నిద్ర త‌గినంత ఉంటే దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. అదే నిద్ర లేక‌పోతే అధికంగా బ‌రువు పెరుగుతారు. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల్సిందే. అయితే ప్ర‌స్తుత ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో స‌గ‌టు పౌరుడు నిత్యం ఎదుర్కొనే ఒత్తిళ్ల వ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు లోన‌వుతూ నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. కానీ.. కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే రోజూ రాత్రి చ‌క్క‌గా నిద్రించ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. నిద్రించే బెడ్‌రూంలో చాలా త‌క్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి. నీలం రంగు బెడ్‌లైట్ పెట్టుకుంటే మంచిది. నీలం రంగు కాంతి వ‌ల్ల మ‌నం బాగా నిద్రిస్తామ‌ట‌. అలాగే నిద్రించే ప‌రిస‌రాల్లో ఎలాంటి శ‌బ్దాలు రాకుండా చూసుకుంటే చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.

కొంద‌రికి చ‌ల్ల‌గా ఉంటే న‌చ్చ‌దు. కొంద‌రికి వేడిగా ఉంటే న‌చ్చ‌దు. ఇంకొంద‌రు ఎలాంటి ఉష్ణోగ్ర‌త ఉన్న గ‌దిలోనైనా నిద్రిస్తారు. అయితే ఎవ‌రికైనా స‌రిగ్గా నిద్ర ప‌ట్టాలంటే.. త‌మ‌కు కావ‌ల్సిన ఉష్ణోగ్ర‌త వ‌ద్ద గ‌ది ఉండేలా చూసుకోవాలి. అందుకు ఏసీలు, కూల‌ర్లు వంటివి వాడ‌వ‌చ్చు. లేదా చ‌లికాలం అయితే రూమ్ హీట‌ర్లు వాడ‌వ‌చ్చు. నిద్రించ‌డానికి ముందు మ‌ద్యం సేవించ‌రాదు. సేవిస్తే మ‌న శ‌రీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఫ‌లితంగా నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. క‌నుక మ‌ద్యం సేవించ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. రాత్రి పూట మ‌న‌కు ప‌ని ఏమీ ఉండ‌దు క‌నుక అంత‌గా శ‌క్తి అవ‌స‌రం ఉండ‌దు. క‌నుక భోజనం కూడా త‌క్కువ‌గా చేయాలి. ఆహారం త‌క్కువ‌గా తీసుకోవాలి. దీంతో చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అదే ఆహారం ఎక్కువ‌గా తీసుకుంటే నిద్ర త్వ‌ర‌గా ప‌ట్ట‌దు. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది. క‌నుక ఆహారాన్ని మితంగానే తీసుకోవాలి.

Sleep

మీరు నిద్ర‌పోయే బెడ్ లేదా ప‌రుపు, దిండ్లు మీ శ‌రీరంపై ఒత్తిడి క‌లిగించ‌కుండా చూసుకోవాలి. చాలా సౌక‌ర్య‌వంత‌మైన బెడ్ అయితే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. కొంద‌రు ప‌గ‌టి పూట బాగా నిద్రిస్తుంటారు. అలా చేస్తే రాత్రి పూట నిద్ర ప‌ట్ట‌దు. క‌నుక ప‌గటి పూట నిద్రించ‌కూడ‌దు. లేదా చాలా త‌క్కువ స‌మ‌యం పాటు నిద్రించాలి. దీంతో రాత్రి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. రాత్రి పూట కెఫీన్ ఎక్కువ‌గా ఉండే టీ, కాఫీ వంటివి తాగ‌రాదు. వాటి వ‌ల్ల నిద్రకు అంత‌రాయం క‌లుగుతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌ట్టాలంటే రాత్రి పూట టీ, కాఫీ సేవించ‌రాదు. ప‌గ‌టి పూట సూర్య‌కాంతి మ‌న శ‌రీరానికి బాగా త‌గిలితే రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. క‌నుక ఆ దిశ‌గా య‌త్నిస్తే రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర‌పోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM