Face Fat : సాధారణంగా ఎవరికైనా సరే.. వ్యాయామం చేస్తే అధిక బరువును తగ్గించుకోవడం చాలా సులభమే. ఈ క్రమంలో శరీరంలో ఉండే అనేక భాగాల్లోని కొవ్వు కూడా సులభంగా కరుగుతుంది. అయితే కొందరికి ముఖంపై బాగా కొవ్వు ఉంటుంది. అది ఒక పట్టాన కరగదు. మరి దాన్ని కరిగించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..? అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం కొంత సేపు బెలూన్లను ఊదితే ముఖానికి చక్కని వ్యాయామం అవుతుంది. దీంతో ముఖంపై ఉండే కొవ్వు కరిగి ముఖం అందంగా మారుతుంది. సాధారణంగా చాలా మందికి చూయింగ్ గమ్‌లను తింటూ బుడగలను ఊదే అలవాటు ఉంటుంది. అయితే నిజానికి అది మంచిదే. దాంతో ముఖానికి చక్కని వ్యాయామం జరిగి ముఖంపై ఉండే కొవ్వు కరుగుతుంది. అయితే నిత్యం ఉదయం, సాయంత్రం 2 సార్లు 20 నిమిషాల పాటు చూయింగ్ గమ్‌లను నమిలితే మంచిది. ఇక ఆ చూయింగ్ గమ్‌లు కూడా షుగర్ లెస్‌వి అయితే మన శరీరంలో అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటాయి.
చేపల మాదిరిగా బుగ్గలను లోపలికి మడిచి నవ్వేందుకు యత్నించాలి. ఇలా 10 సెకన్లపాటు నిత్యం 15 సార్లు చేయాలి. దీంతో ముఖంలో ఉండే కొవ్వు కరిగి ముఖానికి చక్కని ఆకృతి వస్తుంది. కళ్లను పెద్దవిగా చేసి, నోట్లో ఉన్న నాలుకను బయట పెట్టి సాగదీయాలి. అనంతరం నాలుకతో గడ్డాన్ని తాకే యత్నం చేయాలి. అలా 10 సెకన్ల పాటు నిత్యం 20 సార్లు చేస్తే ముఖంపై ఉండే కొవ్వు కరుగుతుంది. ముఖం నాజూగ్గా కనిపిస్తుంది.
నేలపై వెల్లకిలా పడుకుని లేదా కుర్చీలో వాలుగా ఒరిగి పైకి సీలింగ్‌ను చూస్తూ పెదాలను ముద్దు పెట్టినట్లు ముందుకు తీసుకురావాలి. ఇలా 10 సెకన్ల పాటు నిత్యం 10 సార్లు చేస్తే ముఖానికి మంచి వ్యాయామం అయి కొవ్వు కరుగుతుంది. ఈ వ్యాయామం మెడ, గొంతుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…