Curd And Jaggery : పెరుగు, బెల్లం రెండింటినీ క‌లిపి రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

May 21, 2024 8:07 PM

Curd And Jaggery : నిత్యం మ‌నం తినే అనేక ఆహారాల్లో పెరుగు, బెల్లం కూడా ఒక‌టి. పెరుగును చాలా మంది భోజనం చివ‌ర్లో తింటుంటారు. అలాగే పెరుగుతో మ‌జ్జిగ చేసుకుని తాగుతుంటారు. ఇక బెల్లం విష‌యానికి వ‌స్తే దీంతో అనేక ర‌కాల పిండి వంట‌ల‌ను చేస్తుంటారు. బెల్లాన్ని నేరుగా కూడా కొంద‌రు తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఈ రెండింటి కాంబినేష‌న్ చూస్తే మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఈ రెండింటినీ క‌లిపి రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాలను పొంద‌వ‌చ్చు. పెరుగు, బెల్లం రెండింటినీ క‌లిపి తింటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు, బెల్లం రెండింటి కాంబినేష‌న్ మ‌న ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతుంది. ఇది అనేక వ్యాధుల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అవ‌స‌రం అయిన క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్‌ను అందిస్తుంది. మీరు రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండి ఇబ్బందులు ప‌డుతున్నా, లేక త‌ర‌చూ వ్యాధుల బారిన ప‌డుతున్నా పెరుగు, బెల్లం మిశ్ర‌మాన్ని ట్రై చేయండి. మీకు అద్భుత‌మైన రిజ‌ల్ట్‌ను ఇస్తుంది. ఇక ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయి.

Curd And Jaggery take them both daily for these benefits
Curd And Jaggery

మీకు ర‌క్త‌హీన‌త ఎక్కువ‌గా ఉంటే మీరు పెరుగు, బెల్లం కాంబినేష‌న్ ను త‌ప్ప‌క తీసుకోవాల్సిందే. దీన్ని తిన‌డం వ‌ల్ల ర‌క్తం అధికంగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. అలాగే జీర్ణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా పనిచేయ‌న‌ప్పుడు అంటే మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, అజీర్తి, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు పెరుగు, బెల్లం క‌లిపి తింటే ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. ఇక అధికంగా బ‌రువు ఉన్న‌వారు కూడా పెరుగు, బెల్లం కాంబినేష‌న్ ను ట్రై చేయాల్సిందే.

పెరుగు, బెల్లం క‌లిపి తింటే పొట్ట అంతా నిండుగా ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోరు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఈ రెండింటినీ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు త‌గ్గుతాయి. ఇలా పెరుగు, బెల్లం మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. క‌నుక ఈ రెండింటినీ రోజూ తీసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now