lifestyle

Chanakya Niti : మీకు ఏమైనా బాధ‌లు ఉన్నాయా.. అయితే ఇలాంటి వారికి మాత్రం మీ బాధ‌ల‌ను అస‌లు చెప్ప‌కండి..!

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు మ‌న‌కు ఎన్నో విలువైన విష‌యాల‌ను చాణ‌క్య నీతి అనే పుస్త‌కం ద్వారా తెలియ‌జేసాడు. చాణక్యుడు చెప్పిన విష‌యాల‌ను పాటించిన వారు జీవితంలో ఎప్పుడూ వెనుక‌డుగు వేయ‌రు. ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చిన వాటిని ఎదుర్కొని నిల‌బ‌డ‌తారు. చాణ‌క్యుడు మ‌న‌కు చెప్పిన మంచి విష‌యాల్లో ఒక దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న దుఃఖాన్ని కానీ, బాధ‌ను కానీ కొంద‌రు వ్య‌క్తుల ద‌గ్గ‌ర అస్స‌లు చెప్ప‌కూడ‌దని చాణ‌క్య నీతి చెబుతుంది. మ‌న బాధ‌ను ఇత‌రుల ద‌గ్గ‌ర చెప్పుకుంటే వారు మ‌న‌ల్ని ఎగ‌తాళి చేయ‌వ‌చ్చు. దీంతో మ‌న బాధ మ‌రింత ఎక్కువ అవుతుంది. చాణ‌క్య నీతి ప్ర‌కారం మ‌న బాధ‌ను చెప్ప‌కూడ‌ని ఐదుగురు వ్య‌క్తులేవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. చాణ‌క్య నీతి ప్ర‌కారం ప్ర‌తి దానిని ఎగ‌తాళి చేసే వారి ద‌గ్గ‌ర మ‌న బాధ‌ను పంచుకోకూడదు.

వీరు మ‌న బాధ‌ను చాలా తేలిక‌గా తీసుకుంటారు. మ‌న దుఃఖాన్ని వారు ఎగ‌తాళి చేయ‌వ‌చ్చు. అలాగే అంద‌రికి మిత్రుడు అయిన వాడు ఎవ‌రికి మిత్రుడు కాడు అనే సామెత ఉండ‌నే ఉంది. క‌నుక అంద‌రితో స్నేహం చేసే వారితో కూడా మ‌న బాధ‌ను చెప్ప కూడ‌దు. ఇతను మన‌ బాధ‌ను ఇత‌రుల‌తో చెప్పే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మ‌న‌కు స్నేహితుడు అయిన‌ప్ప‌టికి అంద‌రితో స్నేహం చేసే వారితో మ‌న‌కు బాధ‌ను పంచుకోకూడ‌దు. అలాగే మన పురోగ‌తి, విజ‌యం ప‌ట్ల అసూయ చెందే వారికి కూడా మ‌న దుఃఖాన్ని, బాధ‌ను చెప్ప‌కూడ‌దు. ఇలాంటి వారు మ‌న బాధ‌ను చెప్పిన‌ప్పుడు పైకి ఓదార్పుగా, మంచిగా మాట్లాడిన‌ప్ప‌టికి లోప‌ల సంతోషంగా ఉంటారు. అలాగే కొంత మంది ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు.

Chanakya Niti

ఎవ‌రితోనైనా వారు చెప్పేది విన‌కుండా, అర్థం చేసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వారికి కూడా మ‌న బాధ‌ను చెప్ప‌కూడ‌దు. ఇలాంటి వ్య‌క్తులు మ‌న బాధ‌ను ప్ర‌తికూలంగా వ‌క్రీక‌రించగ‌ల‌రు. క‌నుక ఇలాంటి వారికి కూడా బాధ‌ను చెప్ప‌కూడ‌దు. అలాగే కొంద‌రు ఇత‌రుల గురించి అస్స‌లు ఆలోచించ‌రు.మంచి జ‌రిగినా, చెడు జ‌రిగినా వారి గురించి మాత్ర‌మే ఆలోచిస్తారు. ఎవ‌రికి హాని క‌లిగిన వీరు ప‌ట్టించుకోరు. ఎప్పుడూ వారి స్వ‌లాభాన్ని మాత్ర‌మే చూసుకుంటారు. అలాంటి వ్య‌క్తుల‌కు మ‌న దుఃఖాన్ని చెప్ప‌కూడ‌దు. వీరు మ‌నం చెప్పే బాధ‌ల‌ను ఎప్ప‌టికి అర్థం చేసుకోలేరు. చాణ‌క్య నీతి ప్ర‌కారం ఇటువంటి వ్య‌క్తుల‌కు మ‌న బాధ‌ను ఎప్ప‌టికి చెప్ప‌కూడ‌దని వీరికి మ‌న బాధ‌ల‌ను చెప్పుకున్న‌ప్ప‌టికి అది వ్య‌ర్థ‌మే అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM