Chaddannam : మనం రోజూ ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, దోశ, వడ, ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. అయితే పూర్వకాలంలో ఇటువంటి అల్పాహారాలు ఏమి లేని రోజుల్లో మన పెద్దలు చద్దనాన్ని తయారు చేసి తీసుకునే వారు. చద్దనాన్ని తీసుకోవడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఎముకలు ధృడంగా తయారవుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేసవికాలంలో మట్టి పాత్రలో తయారు చేసిన చద్దనాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. కనుక కనీసం వారంలో ఒక్కసారైనా చద్దనాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనిని వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా సులభంగా చద్దనాన్ని తయారు చేసుకోవచ్చు. శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ చద్దనాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చద్దన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
గంజి – ఒక కప్పు, అన్నం – ఒకటిన్నర కప్పులు, వేడి పాలు – ఒకటిన్నర కప్పు, పెరుగు – ఒక టీ స్పూన్. పచ్చిమిర్చి – 2, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత.
చద్దన్నం తయారీ విధానం..
ముందుగా అన్నం ఉడికేటప్పుడే గంజిని వార్చి పక్కకు ఉంచాలి. అలాగే మనం తినగా మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారిన గంజి వేసి కలపాలి. తరువాత ఇందులో వేడి పాలు పోసి కలపాలి. పాలుగోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. పాలు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత పైన ఉల్లిపాయ ముక్కలు, గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ ఉదయానికి చద్దన్నం తయారవుతుంది. ఇది మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చద్దన్నం తయారవుతుంది. దీనిని ఉల్లిపాయ, పచ్చిమిర్చితో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చద్దనాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…