Cool Drinks In Summer : రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఎండ నుండి సేద తీరడానికి ప్రజలు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి ప్రజలు ఎక్కువగా శీతల పానీయాలను తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే హాని అంతా ఇంతా కాదు. వీటికి బదులుగా మనం ఇంట్లోనే చాలా సులభంగా డ్రింక్స్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే ఎండ నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. 5 నిమిషాల్లోనే ఈ డ్రింక్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ఎండ నుండి ఉపశమనాన్ని అందించే రెండు రకాల డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు.
సోంపు – ఒక టేబుల్ స్పూన్, కలకండ లేదా పంచదార – తీపి రుచికి తగినంత, మిరియాలు – 10 నుండి 12, యాలకులు – 3, బ్లాక్ సాల్ట్ లేదా ఉప్పు – చిటికెడు, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.
సోంపు డ్రింక్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో సోంపు, కలకండ, మిరియాలు, యాలకులు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మరసం, 250 నండి 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి బాగా కలపాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో ఐస్ క్యూబ్స్ వేసి కలపాలి. తరువాత ఈ డ్రింక్ ను గ్లాస్ లో పోసి పైన పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోంపు డ్రింక్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.
బెల్లం డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – ఒక కప్పు, పుదీనా ఆకులు – 6, అల్లం – అర ఇంచు ముక్క, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, బ్లాక్ సాల్ట్ లేదా ఉప్పు – చిటికెడు.
బెల్లం డ్రింక్ తయారీ విధానం..
ముందుగా జార్ లో బెల్లం తురుము, పుదీనా ఆకులు, అల్లం ముక్కలు, నిమ్మరసం, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి. తరువాత ఇందులో ఐస్ క్యూబ్స్, 250 నండి 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. తరవాత గ్లాస్ లో పోసి పైన పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం డ్రింక్ తయారవుతుంది. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా డ్రింక్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఎండ నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…