lifestyle

Avocado : వీటి గురించి మీకు తెలుసా.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Avocado : అవ‌కాడోల‌ను ఒక‌ప్పుడు చాలా ఖ‌రీదైన పండుగా భావించి చాలా మంది వాటిని దూరంగా ఉంచేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. అంద‌రిలోనూ నెమ్మ‌దిగా మార్పు వ‌స్తోంది. దీంతో అవ‌కాడోల‌ను కూడా ఇప్పుడు చాలా మంది తింటున్నారు. వీటిని చాలా రెస్టారెంట్లు త‌మ త‌మ డిషెస్‌లో వేసి వండుతున్నాయి. అలాగే వీటిని స‌లాడ్స్‌, స్మూతీలు, డోన‌ట్స్‌, శాండ్ విచ్‌లు వంటి ఆహార ప‌దార్థాల‌తోనూ చాలా మంది క‌లిపి తింటున్నారు. అయితే అవ‌కాడోల‌ను నిత్యం మ‌నం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అవ‌కాడోల‌లో మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే మంచి కొవ్వు (హెచ్‌డీఎల్‌) ఉంటుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అలాగే పొటాషియం, ల్యూటేన్‌, ఫోలేట్ త‌దిత‌ర పోష‌కాలు కూడా అవ‌కాడోల్లో పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ప‌లు జ‌బ్బులు రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అలాగే అవ‌కాడాల్లో దాదాపుగా అన్ని ర‌కాల బి విట‌మిన్లు ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి.

అవ‌కాడోల‌లో ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, జింక్‌, విట‌మిన్ సి, ఎ, ఇ, కె లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అలాగే అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మ‌ధుమేహం ఉన్న‌వారు అవ‌కాడోల‌ను తిన‌డం మంచిది. దీంతో వారి షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి. అవ‌కాడోల‌లో ఉండే విట‌మిన్ ఎ, కెరోటినాయిడ్స్ కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. కళ్ల‌లో శుక్లాలు రాకుండా చూస్తాయి. కళ్ల‌లో మచ్చ‌లు రాకుండా ఉంటాయి. అలాగే ప‌లు క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అవ‌కాడోల‌ను తింటే ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటివి త‌గ్గుతాయ‌ట‌. అంతేకాదు, మూడ్ కూడా మారుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఆస్టియో ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు అవ‌కాడోల‌ను తింటే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Avocado

అవ‌కాడోల‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం రాకుండా ఉంటాయి. ఆ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు అవ‌కాడోల‌ను తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అలాగే అవ‌కాడోల‌లో ఉండే యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు మ‌న జీర్ణాశ‌యంలో ఉండే బాక్టీరియా, వైర‌స్ త‌దిత‌ర క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM