Eggs : కోడిగుడ్లు తినేవారు, తినని వారు ఎవరైనా సరే.. వాటిని నాన్ వెజ్ ఆహారం కిందే జమకడతారు. కానీ కొందరు మాత్రం గుడ్లను వెజ్ ఆహారం అని అంటారు. అయితే ఈ డిబేట్ ఎప్పటి నుంచో నడుస్తోంది. కానీ కొందరు మాత్రం కోడిగుడ్లు వెజ్జా, నాన్ వెజ్జా అని చూడకుండా లాగించేస్తుంటారు. వాటితో పలు రకాల వంటలు చేసుకుని లేదా ఉడకబెట్టుకుని, ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. అయితే మరి.. అసలు కోడిగుడ్లు నిజంగానే నాన్ వెజ్ ఆహారమా..? అందులో నిజంత ఎంత ఉంది.. తెలుసుకుందాం పదండి..!
కోడిగుడ్లలో మూడు భాగాలు ఉంటాయని తెలుసు కదా. ఒకటి పైన ఉండే పెంకు, రెండోది తెల్లసొన, మూడోది లోపల ఉండే పచ్చ సొన. తెల్ల సొనలో ప్రోటీన్లు, నీరు ఉంటాయి. అందులో జంతువులకు సంబంధించిన కణాలు ఉండవు. కనుక దాన్ని ప్యూర్ వెజ్‌గా చెప్పవచ్చు. ఇక పచ్చ సొనలో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ప్రోటీన్లు ఉంటాయి. వాటితోపాటు ప్రత్యుత్పత్తి కణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అందువల్ల పచ్చ సొనను నాన్‌వెజ్ అని చెప్పవచ్చు.
అయితే అసలు విషయానికి వస్తే.. కోడిగుడ్లను వెజ్ ఆహారం అనే చెప్పాలి. ఎందుకంటే.. వాటిల్లో జంతు కణాలు ఉండవు. పచ్చ సొనలో కణాలు ఉంటాయి కానీ.. అవి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడేవి. అవి కూడా చాలా అత్యల్పంగా ఉంటాయి. అందువల్ల ఓవరాల్‌గా చూస్తే కోడిగుడ్లను వెజ్ ఆహారమే చెప్పవచ్చు. మరి అవి కోడి నుంచి వస్తాయి కదా.. అంటారా.. అయితే మరి పాలు కూడా జంతువుల నుంచి వస్తాయి కదా.. వాటినేమంటారు.. వెజ్ అనా, నాన్‌వెజ్ అనా..? ఏదీ అనలేరు కదా. అలాగే గుడ్లను కూడా 100 శాతం వెజ్ అని చెప్పలేం. కానీ 99.99 శాతం వరకు అందులో ఉండేది వెజ్ పదార్థమే.. కనుక కోడిగుడ్లను వెజ్ ఆహారమే అని చెప్పవచ్చు..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…