lifestyle

Akbar And Birbal : దేవుడు ఎక్క‌డుంటాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు.. అనే ప్ర‌శ్న‌ల‌కు బీర్బ‌ల్ చెప్పిన స‌మాధానాలివే..!

Akbar And Birbal : అక్బ‌ర్‌, బీర్బ‌ల్ గురించి తెలియ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. చిన్న పిల్ల‌లు మొద‌లు కొని పెద్ద‌ల వ‌ర‌కు అందరికీ వీరి గురించి తెలుసు. అక్బ‌ర్ పాలన‌లో బీర్బ‌ల్ త‌న తెలివితో ఎన్నో క్లిష్ట‌త‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాడు కూడా. అందుకు అక్బ‌ర్ బీర్బ‌ల్‌ను ఎన్నోసార్లు మెచ్చుకోవ‌డం, అందుకు త‌గిన బ‌హుమ‌తిని అతనికి ఇవ్వ‌డం కూడా జ‌రిగింది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ సంఘ‌ట‌న గురించే. మ‌రి అక్బ‌ర్ బీర్బ‌ల్‌ను ఏం అడిగాడో, బీర్బ‌ల్ అందుకు ఏమ‌ని సమాధాన‌మిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందామా.

ఒకానొక రోజు అక్బ‌ర్‌కు చాలా విచిత్ర‌మైన సందేహాలు వ‌చ్చాయి. సందేహాలు అనేకంటే వాటిని ప్ర‌శ్న‌లు అన‌డ‌మే ఉత్తమం. ఆ ప్ర‌శ్న‌లు అక్బ‌ర్‌కు తలెత్తిన వెంట‌నే వాటిని నివృత్తి చేసుకోవాల‌ని అనిపించింది. వెంట‌నే బీర్బ‌ల్‌ను పిలిపించాడు. అవే ప్ర‌శ్న‌ల‌ను అత‌నికి సంధించాడు. అవేమిటంటే..

Akbar And Birbal

1. దేవుడు ఎక్క‌డుంటాడు ?, 2. అత‌ని ప‌ని ఏమిటి ?, 3. అత‌ను ఏం తింటాడు ? ఆ ప్ర‌శ్న‌ల‌ను విన్న బీర్బ‌ల్‌కు మొద‌ట ఆశ్చ‌ర్యం వేసింది. అయినా చ‌క్ర‌వ‌ర్తి అడుగుతున్నాడు క‌దా. స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న‌ ముందుకు వెళ్లి ఇలా అన్నాడు. దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. అత‌ను ఉండ‌ని ప్ర‌దేశం లేదు. భ‌క్తుల‌కు ఆయ‌న త‌మ త‌మ హృదయాల్లో ద‌ర్శ‌న‌మిస్తాడు. ప్రేమ, ద‌య‌, జాలి ఎక్క‌డ ఉంటుందో ఆయ‌న అక్క‌డే ఉంటాడు. ఈర్ష్య‌, అసూయ‌, ద్వేషం వంటి వాటిని మ‌నుషుల నుంచి తరిమికొడుతూ వారిని మంచి వారిగా మార్చ‌డ‌మే ఆయ‌న పని. నిత్యం ఆ ప‌నిలోనే ఆయ‌న ఉంటాడు. మ‌నుషుల్లో మార్పు తెస్తుంటాడు. మ‌నుషుల్లో ఉన్న అహంకారాన్ని దేవుడు తినేస్తాడు. అదే ఆయ‌న‌కు ఆహారం. దాన్ని తిని మ‌నుషుల‌ను మంచి వారిగా మారుస్తాడు. ఇలా బీర్బ‌ల్ చెప్పిన స‌మాధానాల‌కు అక్బ‌ర్ సంతృప్తి చెంది అత‌న్ని బ‌హుమ‌తుల‌తో స‌త్క‌రిస్తాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM