Tech Mahindra Jobs : టెక్ మహీంద్రా లో 120 పోస్టులు.. నెలకి రూ.30,000 జీతం..!

September 15, 2023 10:27 AM

Tech Mahindra Jobs : ఒక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే గుడ్ న్యూస్. టెక్ మహీంద్రాలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు టెక్ మహీంద్రా నోటిఫికేషన్ ని జారీ చేసింది. అర్హులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. టెక్ మహీంద్రా కంపెనీ స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ని కూడా ఇస్తుంది. ఇక మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం. టెక్ మహీంద్రాలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేయాలనుకునే వాళ్ళకి ఇదే గొప్ప అవకాశం.

ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చుని టెస్ట్ రాసి, ట్రైనింగ్ కూడా కంపెనీ ద్వారా పొందవచ్చు. వారానికి ఆరు రోజులు మాత్రమే పని చేయాలి. అప్లై చేయడానికి కావాల్సిన అర్హత వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా 120 పోస్టులతో కూడిన జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే, 10 + 2 లేదా 10 + 3 పూర్తి చేయడంతోపాటు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.

Tech Mahindra Jobs apply for customer service executive posts
Tech Mahindra Jobs

వారంలో ఆరు రోజులు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇన్ కాల్స్, అవుట్ కాల్స్ ని రిసీవ్ చేసుకునే నైపుణ్యం ఉండాలి. ఈ జాబ్ ని పొందాలనుకునే వాళ్ళు అప్లికేషన్ ని పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

జీతం విషయానికి వస్తే, నెలకి రూ.30,000 జీతం కింద కంపెనీ ఇస్తుంది. దానితోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. రాత పరీక్ష ఏమీ ఉండదు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ ని పొందొచ్చు. పూర్తి వివరాల‌ కోసం ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి.

https://www.naukri.com/job-listings-customer-support-executive-tech-mahindra-bangalore-bengaluru-0-to-4-years-050923009963

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now