TCS Work From Home Jobs 2023 : టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై.. డిగ్రీ చాలు..!

September 12, 2023 5:22 PM

TCS Work From Home Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్లకి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది టీసీఎస్. కామన్ డిగ్రీ చేసి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. దేశంలోని అన్ని లొకేషన్లలో ఖాళీ ఉన్న ట్రెయినీ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టులకి స్త్రీ, పురుష అభ్యర్థులందరూ అర్హులే. ఆన్ లైన్ విధానం ద్వారా అప్లై చేయవచ్చు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసేయవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 2024 ట్రైనీ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ పోస్టులు వున్నాయి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ రెండు రాష్ట్రాల వాళ్ళు అర్హులే. దరఖాస్తు చేయవచ్చు.

TCS Work From Home Jobs 2023 how to apply online
TCS Work From Home Jobs 2023

ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళ వ‌య‌స్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. విద్యార్హతలు చూస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం కళాశాల నుంచి బీఏ/బీకామ్/ బీఏఎఫ్/ బీబీఐ పూర్తి చేసుండాలి. లేదంటే బీబీఏ/ బీబీఎం / బీఎంఎస్ / బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం) లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సెప్టెంబర్ 20, 2023 వరకు ఈ పోస్టులకి అప్లై చేయడానికి టైం వుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న నోటిఫికేషన్ లింకు పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం : https://www.tcs.com/careers/india/tcs-bps-fresher-hiring-2024

ఆన్ లైన్ అప్లై : https://www.tcs.com/careers/india/tcs-bps-fresher-hiring-2024

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment